हैदराबाद: मुख्यमंत्री के चंद्रशेखर राव ने भद्राद्री कोत्तागुडेम जिले में गुत्तिकोयला समुदाय के हमले में वन रेंज अधिकारी (एफआरओ) श्रीनिवास राव की पर शोक व्यक्त किया है। एफआरओ परिवार के सदस्यों के प्रति अपनी गहरी संवेदना व्यक्त की। इस घटना के दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए कानूनी कार्रवाई करने का डीजीपी महेंद्र रेड्डी को निर्देश दिया गया है।
50 लाख रुपये अनुग्रह राशि
साथ ही मुख्यमंत्री ने मृतकों के परिजनों को 50 लाख रुपये की अनुग्रह राशि देने की घोषणा की। साथ ही मृतक श्रीनिवास राव के परिवार के सदस्यों को सेवानिवृत्ति की आयु तक पूर्ण वेतन प्रदान करने और करुण्य नियुक्ति के तहत परिवार के पात्र सदस्यों में से एक व्यक्ति को सरकारी नौकरी देने का मुख्य सचिव को निर्देश दिया।
राजकीय सम्मान के साथ अंतिम संस्कार
मुख्यमंत्री ने मंत्री इंद्रकरण रेड्डी और पुव्वाड़ा अजय कुमार को राजकीय सम्मान के साथ श्रीनिवास राव का अंतिम संस्कार करने और अंत्येष्टि संस्कार में भाग लेने का आदेश दिया है। मुख्यमंत्री के आदेशानुसार सीएस सोमेश कुमार ने श्रीनिवास राव के परिवार के सदस्यों को अनुग्रह राशि, सेवानिवृत्ति की आयु तक का वेतन, परिवार में से किसी एक को नौकरी और निवास स्थल आवंटित करने का आदेश जारी किया है। सरकार ने सरकारी कर्मचारियों की तरह श्रीनिवास राव के परिवार को सभी चिकित्सा सुविधाएं प्रदान करने और घर का किराया भी देने का फैसला किया है। श्रीनिवास का आज अंतिम संस्कार किया जाएगा।
सरकार कर्मचारियों के साथ खड़ी है
मुख्यमंत्री केसीआर ने चेतावनी दी है कि अपनी ड्यूटी निभा रहे सरकारी कर्मचारियों पर हमले को बर्दाश्त नहीं किए जाएंगे। उन्होंने स्पष्ट किया कि दोषियों को कड़ी से कड़ी सजा दी जाएगी। उन्होंने आश्वासन दिया कि सरकार सरकारी कर्मचारियों के साथ खड़ी रहेगी। सीएम ने बिना किसी डर के अपने कर्तव्यों का पालन करने का कर्मचारियों ने अपील की।
ఉద్యోగులపై దాడులు సహించం: ముఖ్యమంత్రి కేసీఆర్
Hyderabad: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్టు రేంజ్ అధికారి(ఎఫ్‌ఆర్‌వో) శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌వో కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు.
50 లక్షల ఎక్స్‌గ్రేషియా
మృతుని కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శ్రీనివాసరావు రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు ఆయన కుటుంబసభ్యులకు పూర్తిస్థాయి జీతభత్యాలు అందజేయాలని, కారుణ్య నియామకం కింద కుటుంబసభ్యుల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు.
ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో శ్రీనివాసరావు అంత్యక్రియలు
శ్రీనివాసరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని, అంత్యక్రియల్లో పాల్గొనాలని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు ఎక్స్‌గ్రేషియా, రిటైర్మెంట్ వయసు వరకు జీతభత్యాలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు ఇంటిస్థలం కూడా కేటాయిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే అన్ని మెడికల్ సౌకర్యాలు కల్పించడంతోపాటు ఇంటి అద్దె కూడా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వోద్యోగులకు అండగా ప్రభుత్వం
విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి జంకు లేకుండా తమ విధులను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు