కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఆహార అలవాట్ల అవగాహన సదస్సు
కర్నూలు (ఆంధ్రప్రదేశ్) : నేటి యుగంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు చిరుధాన్యాలు సమగ్ర పరిష్కారమన్నారు స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఖాదర్ వలి. కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఆహార అలవాట్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రస్తుతం ప్రజలు ముఖ్యంగా ఆహార సంబంధిత అనారోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని, వాటిని నివారించడానికి జీవన విధానంలో చిరుధాన్యాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. రైతులకు మాత్రమే కాకుండా ప్రతి కుటుంబానికి చిరుధాన్యాలు అనేక ప్రయోజనాలను అందిస్తాయని, నేటి తరంలో విస్తరిస్తున్న జీవనశైలి వ్యాధులకు చిరుధాన్యాలే చక్కని నివారణ అని డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీజీ శివరాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి విజయ్ కుమార్, పాణ్యం శాసనసభ్యులు గౌరవ చరితా, ప్రముఖ రైతు భాస్కర్ రెడ్డి, జుబేదా మరియు పెద్ద సంఖ్యలో రైతులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. జానపద నృత్యాలతో కార్యక్రమం ప్రారంభమై, అనంతరం డాక్టర్ ఖాదర్ తో పాల్గొన్న వారు తమ ఆరోగ్య సమస్యలు, సందేహాలను అడిగి విలువైన సలహాలు, సూచనలు పొందారు.
Also Read-
ప్రజల్లో ఆహార మార్పులపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో అదితి మిల్లెట్స్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
