हैदराबाद : अल्लूरी सीताराम राजू जिले में आंध्र प्रदेश-ओडिशा सीमा पर माओवादियों और पुलिस के बीच मुठभेड़ हुई। सीलेरू पुलिस ने खुलासा किया कि इस फायरिंग में प्रमुख माओवादी नेता जनुमुरु श्रीनुबाबू उर्फ रैनो उर्फ सुनील पकड़ा गया। सुनील के पास से आईईडी, बंदूक, विस्फोटक, क्रांतिकारी साहित्य और नगद रकम जब्त किया गया। पुलिस ने यह भी बताया कि पिछली सरकार ने सुनील पर पांच लाख रुपये इनाम की घोषणा की थी। माओवादी सुनील कई अहम मामलों में आरोपी है।
पुलिस ने बताया कि 23 सितंबर 2018 को हुई पूर्व विधायक किडारी सर्वेश्वर राव और सिवेरी सोमले की हत्या के मामले में सुनील मुख्य आरोपी है। पुलिस ने स्पष्ट किया कि सुनील एओबी की विशेष जोन मंडल समिति का सदस्य है। उसने एओबी में कई हिंसक घटनाओं में भाग लिया। माओवादी सुनील आंध्र प्रदेश, ओडिशा और छत्तीसगढ़ में मोस्ट वांटेड माओवादी है। आपको बता दें कि 23 सितंबर, 2018 को सर्वेश्वर राव और सिवेरी सोमा की हत्या के मामले ने हड़कंप मचा था।
ఐదు లక్షల ప్రైజ్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అరెస్ట్, ఆ ఇద్దరు నేతలను చంపింది ఇతనే!
హైదరాబాద్ : అల్లూరి జిల్లాలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత జనుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్ పట్టుబడినట్టు సీలేరు పోలీసులు వెల్లడించారు. రైనో నుంచి ఐఈడీ, తుపాకీ, పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, డబ్బు స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వం రైనోపై రూ. 5 లక్షల రివార్డు ప్రకటించినట్టు పోలీసులు చెప్పారు. Maoist Rhino పలు కీలక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
2018 సెప్టెంబర్ 23న జరిగిన మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలే హత్యకేసులో రైనో ప్రధాన నిందితుడని పోలీసులు వివరించారు. ఏవోబీ ప్రత్యేక జోన్ డివిజినల్ కమిటీ సభ్యుడిగా ఉన్న రైనో.. ఏఓబీలో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్టు పోలీసులు స్పష్టం చేశారు. ఇతను ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా మారాడు. 2018 సెప్టెంబర్ 23న జరిగిన కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్య కేసులు సంచలనంగా మారాయి. (ఏజెన్సీలు)