హైదరాబాద్ : ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అంబేద్కర్ గ్రౌండ్ వద్ద ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను ప్రారంభించారు.
గౌరవ అతిథులుగా ఆల్ ఇండియా ఫిషర్మెన్ కాంగ్రెస్ జాతీయ చైర్మన్ అర్మస్ట్రాంగ్ ఫెర్నాండో హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ పీసీసీ హన్మంతరావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం నాగరికరీ, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మరియు పలువురు కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.
సంబంధిత వార్తలు-
తెలంగాణలోని పలువురు మత్స్యకారులకు ప్రముఖల చేతుల మీదుగా ఉత్తమ సేవా పత్రాలను అందజేశారు. రాష్ట్ర మత్స్యశాఖ ఉన్నత అధికారులకు సేవలు అందించినందుకుగాను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు.