హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మైలాన్ పరిశ్రమలో ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో ముగ్గురు కార్మికులు ప్రాణాలొదిలారు. ప్రమాదంలో భాగంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని చీకటిమయం చేశాయి. మైలాన్ పరిశ్రమలోని వేర్‌హౌస్ లోపల ద్రావకాన్ని వేరే డ్రమ్ములోకి మారుస్తున్న క్రమంలో స్ట్రాటిక్ ఎనర్జీతో ప్లాష్ ఫైర్ రావడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్లు బొల్లారం సీఐ సురేందర్ రెడ్డి వెల్లడించారు.
ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా(40), బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్( 27), లోకేశ్వర రావు(38) కాంట్రాక్టు కార్మికులు తీవ్ర గాయాలకు గురయ్యారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకోచ్చారు.
अग्नि दुर्घटना: माइलन उद्योग में भीषण आग, तीन श्रमिकों की मौत
हैदराबाद : तेलंगाना के संगारेड्डी जिले के जिन्नाराम मंडल के गड्डपोतारम इंडस्ट्रियल एस्टेट में भीषण आग लग गई। माइलान उद्योग में अचानक लगी आग में तीन श्रमिकों की मौत हो गई। दुर्घटना के कारण बड़े पैमाने पर आग लग गई। घने धुएं ने पूरे क्षेत्र को घेर लिया और अंधेरा हो गया।
बोलारम सीआई सुरेंद्र रेड्डी ने खुलासा किया कि माइलान उद्योग के गोदाम के अंदर सॉल्वेंट को दूसरे ड्रम में बदलने की प्रक्रिया में ऊर्जा के साथ फ्लैश फायर के कारण आग दुर्घटना हुई।
इस हादसे में पश्चिम बंगाल के ठेका मजदूर परितोष मेहता (40), बिहार के रंजीत कुमार (27) और लोकेश्वर राव (38) गंभीर रूप से घायल हो गए। उन्हें अस्पताल ले जाया गया। इलाज के दौरान तीनों की मौत हो गई। सूचना मिलते ही दमकल व पुलिस मौके पर पहुंच गई। दमकल कर्मियों ने आग पर काबू पा लिया है।