हैदराबाद: बोइनपल्ली पुलिस स्टेशन इलाके में अप्रिय मामला प्रकाश में आया है। भवानी नगर में आर्थिक तंगी के कारण पिता ने दो बेटियों के साथ आत्महत्या कर ली। बेटियों को नींद की गोलियाँ देने के बाद पिता ने भी नींद की गोलियाँ खाकर आत्महत्या कर ली।
पुलिस ने बताया कि ओल्ड बोइनपल्ली के भवानी नगर में रहने वाला श्रीकांत चारी का परिवार चांदी का कारोबार करता है। स्थानीय लोगों ने बताया कि पिछले कुछ समय से घर में झगड़ा होता रहता था, लेकिन अब सब ठीक से रह रहे है।
शुक्रवार अलसुबह बेटियों के पिता ने नींद की गोलियाँ खा लीं और अपनी बेटियों श्रव्या (7) और श्रवंती (8) को भी नींद की गोलियाँ दे दीं। इसके कारण बेटियों के साथ पिता की भी मौत हो गई। एक साथ परिवार के तीन सदस्यों की मौत से भवानी नगर मातम में डूब गया। मौके पर पहुंची बोइनपल्ली पुलिस मामला दर्ज कर आत्महत्या के तरीके की तहकीकात कर रही है।
बेटे के माता-पिता ने कहा कि उन्हें खुद अपने बेटे और पोतियों की मौत के कारणों का पता नहीं है। उन्होंने बताया कि उनका बेटा हर दिन चांदी का काम करने जाता था। उन्होंने कहा कि पिछले कुछ समय से उसका कारोबार अच्छा नहीं चल रहा था। पुलिस सभी पहलुओं से जांच कर रही है।
అమాయక కూతుళ్లకు నిద్రమాత్రలు వేసి తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్ : బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భవాని నగర్ లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతుళ్లకు నిద్ర మాత్రలు ఇచ్చి అనంతరం తండ్రి కూడ నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే ఓల్డ్ బోయిన్ పల్లి భవాని నగర్‌లో నివాసముంటున్న శ్రీకాంత్ చారి కుటుంబం సిల్వర్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా ఇంట్లో గొడవలు జరిగేవి అని, ఇప్పుడు బానే ఉన్నారని స్థానికులు తెలిపారు.
శుక్రవారం తెల్లవారు జామున తండ్రి నిద్ర మాత్రలు వేసుకుని కూతుళ్లు శ్రావ్య (7),స్రవంతి(8)లకు నిద్ర మాత్రలు ఇవ్వడంతో చిన్నారులతో పాటు తండ్రి చనిపోయారు. ఒకేసారి కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో భవాని నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.
తమ కొడుకు మనవరాలు చనిపోవడానికి గల కారణాలు తమకే తెలియడం లేదన్నారు. ప్రతిరోజు ఆయన సిల్వర్ వృత్తికి వెళ్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా ఆయన వృత్తి సరిగా నడవడం లేదని అన్నారు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)