हैदराबाद: जब किसानों के पास फसल होती है तो दाम नहीं होते है, लेकिन जब उनके पास फसल नहीं होती तो दाम बढ़ जाते हैं। इससे किसानों से कम कीमत पर फसल खरीदने वाले व्यापारी भारी मुनाफा कमा रहे हैं। यह व्यापारियों के बाज़ार के मायाबाजार (जादू) को दर्शाता है। हालांकि फसल बोने से पहले कीमतें अच्छी होती हैं, यह देख खेती करने वाले किसानों को निराशा का सामना करना पड़ रहा है। किसानों ने सारी फसलें बेचने के बाद अब मिर्च, कपास और तुअर की कीमतें बहुत बढ़ गई हैं। किसानों की ओर से बेची गई फसलों के दाम लगभग दोगुना हो गये हैं। किसानों से खरीदी गई फसल को व्यापारियों ने कोल्ड स्टोरेज रख लिये। अब उनकी चांदी हो रही है। कम से कम किसानों को निवेश मिलने की स्थिति नहीं है। दूसरी ओर मात्रा व्यापारी करोड़ों रुपये लाभ अर्जित कर रहे हैं।
बाजार में मिर्च की कीमत आसमान छू रही है। शुक्रवार को तेजा किस्म मिर्च की कीमत 20 हजार रुपये प्रति क्विंटल की रिकॉर्ड बोली लगाई गई। किसानों द्वारा पहले ही बेची गई फसल को दाम नहीं मिल रहे है। जबकि कोल्ड स्टोरेज और संग्रहीत करने वाले व्यापारियों को लाभ मिल रहा है। किसान के पास फसल होती है तो सही कीमत नहीं मिल रही है। किसान खम्मम और वरंगल बाजार में मिर्च लेकर जाते हैं, तो दलाल और व्यापारी मिलीभगत करके इसे कम कीमत पर खरीदी की हैं। अब स्थिति अलग है। पिछले सप्ताह से अधिकतम कीमत इसी स्तर पर जारी है। मॉडल मिर्च की कीमतें 17,500 रुपये, 17 हजार रुपये, 16,500 रुपये और 16 हजार रुपये हैं। व्यापारियों और कुछ किसानों ने पिछले साल की फसल को खम्मम बाजार में कोल्ड स्टोरेज में संग्रहीत किया था। अब उस स्टोरेज की गई फसलों के दाम अब बढ़ रहे हैं। स्थानीय व्यापारियों का कहना है कि यह फसल फिलहाल मुंबई, कोलकाता और दिल्ली के व्यापारी खरीद रहे हैं।
पिछले सीजन में विभिन्न कारणों से मिर्च की पैदावार में भारी कमी आई है। इसके अलावा किसान को अपेक्षित मूल्य भी नहीं मिला। किसानों को प्रति क्विंटल औसतन 9 हजार रुपये ही मिल रहे है। लेकिन किसानों द्वारा फसल बेचने के बाद ताजा मिर्च की अंतरराष्ट्रीयस्तर पर मांग अचानक बढ़ गई है। विदेशों को लिए मिर्च ज्यादातर निर्यात आंध्र प्रदेश और तेलंगाना से होता है। फिलहाल चीन और थाईलैंड से ऑर्डर आ रहे हैं। अच्छी प्रजाति के तेजा मिर्च क्विंटल की कीमत 20 हजार रुपये तक पहुंच गई है। बाकी किस्मों की मिर्च भी 16 हजार रुपये प्रति क्विंटल हैं। गौरतलब है कि तालु मिर्ची की कीमत भी दस हजार से ज्यादा है। सीजन खत्म होने के बाद बाजार में तुआर को अच्छे दाम मिल रहे हैं। जब फसल किसानों के हाथ में थी तो कीमत 7 हजार रुपये, 7500 रुपये, 8 हजार रुपये और 9 हजार रुपये थी। सीजन के अंत में पिछले सप्ताह क्विंटल तुअर की कीमत 11 हजार रुपये तक पहुंच गई है। तुअर को तेलंगाना से तमिलनाडु, केरल और अन्य राज्यों को रवाना किया जा रहा है।
यह भी पढ़ें-
इस पृष्ठभूमि में, फसल उत्पादों की अनुपलब्धता के कारण व्यापारी प्रतिस्पर्धा करके खरीदारी कर रहे हैं। तेलंगाना में तुआर की खेती करने वाले किसान पहले ही इसे बेच चुके हैं। अधिकांश व्यापारियों के पास तुअर का स्टॉक है। इस महीने की शुरुआत से ही कीमत 11 हजार रुपये के पार पहुंच गई है। इसके चलते व्यापारी मुनाफा कमा रहे हैं। एक तरफ जहां तेल की कीमतों में उतार-चढ़ाव जारी है, वहीं पल्ली फसल की मांग उतनी नहीं है जितनी उम्मीद की जा रही थी। फिलहाल कृषि बाजार में पल्ली की कीमत 5909 रुपये है। बाजार अधिकारियों का कहना है कि फली फसल की मांग फिलहाल कम है और इस वजह से दाम नहीं बढ़ रहे हैं।
किसान से कपास फसल चले जाने के बाद कीमत बढ़ गई। अब बाजार में क्विंटल कपास की कीमत काफी बढ़ रही है और 7250 रुपये तक पहुंच गई है। इससे उन निजी व्यापारियों को फायदा हुआ जो पहले ही फसल खरीद चुके थे। केंद्र सरकार ने ताजा कपास का समर्थन मूल्य 501 रुपये बढ़ा दिया है। पिछले साल यह 6,620 रुपये प्रति क्विंटल था, लेकिन इस साल नई बढ़ी कीमतों के साथ यह 7,121 रुपये है। जब कपास किसानों के पास थी, तो उन्होंने उसे व्यापारियों द्वारा बताई गई कीमत पर बेच दिया। क्योंकि खरीदारों के बीच कोई प्रतिस्पर्धा नहीं थी। औसत क्विंटल कपास 4 हजार रुपये में बेच दिये। इससे किसानों को प्रति क्विंटल 4 से 6 हजार रुपये तक का नुकसान हुआ।
వ్యాపారుల మార్కెట్ మాయాజాలం
హైదరాబాద్ : రైతుల చేతిలో పంట ఉన్నప్పడు ధరలు ఉండవు కానీ పంటల్లేని టైమ్‌లో మాత్రం ధరలు ఫుల్లు పెరుగుతున్నయ్. దీంతో రైతుల వద్ద తక్కువ ధరకు పంటలు కొన్న వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్నారు. ఇది వ్యాపారుల మార్కెట్ మాయాజాలానికి అద్దంపడుతున్నది. పంట వేయకముందు ధరలు బాగానే ఉంటుండగా ఇది చూసి పంటలు సాగుచేసిన అన్నదాతకు నిరాశే ఎదురవుతోంది. రైతులు పంటలన్నీ అమ్ముకున్నంక ఇప్పుడు మిర్చి, పత్తి, కంది ధరలు అమాంతం పెరిగిపోయాయి. దాదాపు వారు అమ్ముకున్న రేటుకు డబుల్ ధర పలుకుతున్నాయి. రైతుల వద్ద పంటకొని కోల్డ్ స్టోరేజీలో దాచుకున్న వ్యాపారుల పంట పండుతోంది. రైతులకు కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా మరోవైపు వ్యాపారులు మాత్రం కోట్లు గడిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మార్కెట్‌లో మిర్చి ధర దుమ్ము రేపుతోంది. శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.20వేల ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన వారికి, వ్యాపారులకే లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అదే రైతు చేతిలో పంట ఉన్నప్పడు మాత్రం ధర ఉండడం లేదు. రైతులు తెచ్చినప్పుడు ఖమ్మం, వరంగల్ మిర్చి మార్కెట్లో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకే కొన్నరు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. గత వారం రోజులుగా గరిష్ట ధర ఇదే స్థాయిలో కొనసాగుతోంది. మోడల్ ధరలు మాత్రం రూ.17,500, రూ.17వేలు, రూ.16,500, రూ.16వేలుగా కొనసాగుతున్నాయి. ఖమ్మం మార్కెట్‌లో గతేడాది పండించిన పంటను వ్యాపారులు, కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. ఆ నిల్వలకు ఇప్పుడిప్పుడే ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం పంటను ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
గత సీజన్లో వివిధ కారణాల వల్ల మిర్చి దిగుబడి భారీగా తగ్గింది. దీనికి తోడు రైతు ఆశించిన ధర దక్కలేదు. సగటున క్వింటాల్‌కు రూ.9 వేలు మాత్రమే దక్కింది. అయితే రైతులు పంట అమ్ముకున్న తర్వాత తాజాగా మిర్చికి ఒక్కసారిగా అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. విదేశాలకు మిర్చి ఏపీ, తెలంగాణల నుంచే ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మేలు రకం తేజ క్వింటాల్ ధర రూ.20వేలకు చేరింది. మిగిలిన మిర్చి రకాలు కూడా క్వింటాల్‌కు రూ.16 వేలు పలుకుతున్నాయి. తాలు మిర్చీ కూడా పది వేలకు పైగా ధర పలకడం గమనార్హం. సీజన్ ముగిసిన తర్వాత కందులకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. పంట రైతుల చేతిలో ఉన్నప్పుడు రూ.7 వేలు, రూ.7,500, రూ.8 వేలు, రూ.9 వేలు ధర పలికింది. సీజన్ ముగియగా తాజాగా గత వారం రోజులుగా క్వింటాల్ కంది ధర రూ.11 వేలకు చేరుకున్నది. రాష్ట్రం నుంచి తమిళనాడు, కేరళ, రాష్ట్రాలకు కందిపప్పు రవాణా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పంటల ఉత్పత్తులు లేక పోవడంతో వ్యాపారులు పోటీ పడి కొంటున్నరు. రాష్ట్రంలో కంది సాగు చేసిన రైతులు ఇప్పటికే అమ్ముకోగా, చాలా వరకు వ్యాపారుల వద్ద కంది నిల్వలు ఉన్నాయి. ఈ నెల ప్రారంభం నుంచే ధర రూ.11 వేలు దాటగా, వ్యాపారులు లాభపడుతున్నారు. ఓవైపు నూనెల ధరలు భగ్గుమంటుంటే పల్లి పంటకు ధరలు మాత్రం అనుకున్నంత డిమాండ్లేదు. ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్లో ధర రూ.5,909 పలుకుతోంది. వేరుసెనగ పంట ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉందనీ, ఈ కారణంగానే ధర పెరగడం లేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
రైతు నుంచి పంట చేజారిన తర్వాత పత్తి ధరలు పెరిగాయి. ఇప్పుడు మార్కెట్లో క్వింటాలు పత్తి ధర గణనీయంగా పెరుగుతూ వస్తూ రూ.7,250కు చేరుకుంది. దీంతో అప్పటికే పంటను కొనుగోలు చేసిన ప్రైవేట్ ట్రేడర్సే లాభపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తాజా పత్తికి మద్దతు ధరను రూ.501 పెంచింది. గతేడాది క్వింటాల్‌కు రూ.6,620 ఉండగా, ఈ యేడాది తాజాగా పెంచిన ధరలతో రూ.7,121 అయింది. పత్తి రైతుల వద్ద ఉన్నప్పుడు గ్రామాల్లో కొనేవారి మధ్య పోటీ లేకపోవడంతో వారు చెప్పిన ధరకే రైతులు అమ్ముకున్నారు. సగటున రూ.4వేలకు క్వింటాల్పత్తిని అప్పజెప్పారు. దీంతో ప్రతి క్వింటాల్‌కు రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య రైతులు నష్టపోయారు. (ఏజెన్సీలు)