हैदराबाद: तेलंगाना कार्यकर्ता, प्रसिद्ध गायक और स्टेट वेयरहाउस कॉर्पोरेशन के अध्यक्ष वी. साईं चंद का निधन हो गया। 39 वर्षीय साई चंद बुधवार शाम अपने परिवार के सदस्यों के साथ नगरकुर्नूल जिले के कारुकोंडा स्थित अपने फार्महाउस गए थे।
हालाँकि, उन्हें आधी रात को दिल का दौरा पड़ा और उन्हें इलाज के लिए नागरकुर्नूल के एक अस्पताल में ले गये। लेकिन उनकी हालत बिगड़ने पर हैदराबाद के गच्चीबावली स्थित केयर अस्पताल लागया गया। इलाज के दौरान उनका निधन हो गया। साई चंद को पत्नी, बेटी और बेटा है।
साई चंद का जन्म 20 सितंबर 1984 को वनपर्ती जिले के अमरचिंता में हुआ था। पीजी तक शिक्षा प्राप्त करने के बाद उन्होंने छात्र जीवन से ही एक कलाकार और गायक के रूप में ख्याति प्राप्त की। तेलंगाना आंदोलन में उन्होंने अपने गानों से लोगों में आंदोलन की भावना जगाई। ‘राती बोम्मलो कोलवैना शिवुडा रक्त बंधन नीकू तेलुयदा…’ बहुत प्रसिद्ध हुआ था।
साई चंद ने अपने गीतों से तेलंगाना द्वारा हासिल की गई प्रगति और राज्य के अस्तित्व में आने के बाद सरकार द्वारा लागू की गई कल्याणकारी योजनाओं को व्यक्त किया। दिसंबर 2021 में साईचंद को मुख्यमंत्री केसीआर द्वारा राज्य गोदाम निगम के अध्यक्ष के रूप में नियुक्त किया गया था। उन्होंने इसी महीने की 24 तारीख को जिम्मेदारी संभाली थी।
इस बीच साईचंद की अचानक निधन की जानकारी मिलने पर सांसद संतोष कुमार केयर अस्पताल पहुंचे। कुमार ने उनके पार्थिव शरीर पर श्रद्धासुमन अर्पित किये और परिवार के सदस्यों से मुलाकात की। परिजनों को ढांढस बंधाया।
साईचंद के निधन पर मुख्यमंत्री केसीआर का गहरा शोक
मशहूर गायक और स्टेट वेयरहाउस कॉरपोरेशन के चेयरमैन साईचंद के निधन पर मुख्यमंत्री केसीआर ने गहरा शोक व्यक्त किया। उन्होंने कहा कि कम उम्र में साईचंद की मौत ने उन पर गहरा दुख पहुंचा। उनके निधन से तेलंगाना ने एक महान गायक और कलाकार खो दिया है। उन्होंने कहा कि साईचंद एक ऐसा कलाकार था जो कम उम्र में ही अद्भुत प्रतिभा दिखाया था। उन्होंने कहा कि बड़े होने की अवस्था में असामयिक मृत्यु बहुत दुख की बात है।
ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతి, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వీ. సాయిచంద్ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్ బుధవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.
అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిచిలించారు.
ఇది కూడా చదవండి
రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను తన పాటలతో చాటిచెప్పారు. 2021, డిసెంబర్లో సాయిచంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు.
కాగా, సాయిచంద్ ఆకస్మిక మృతిని తెలుకున్న ఎంపీ సంతోష్ కుమార్ కేర్ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
సాయిచంద్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణంపట్ల సంతాపాన్ని ప్రకటించారు. చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన మరణంతో తెలంగాణ గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందని చెప్పారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని అన్నారు. ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని తెలిపారు.
రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను, చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాని సీఎం కేసీఆర్ అన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర విస్మరించలేనిదని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం
సాయిచంద్ మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం తెలిపారు. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, సాయిచంద్ మృతదేహానికి టీఎస్ఎమ్మెస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాళులర్పించారు. దవాఖానలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేర్ హాస్పిటల్లో సాయిచంద్ మృతదేహానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ నివాళులర్పించారు. (ఏజెన్సీలు)
ఎమ్మెల్సీ కవిత సంతాపం
తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలచివేసింది. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నాను. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను.
మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త తీవ్రంగా కలచి వేసింది. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నాను.
మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, ఉద్యమ కారుడు సాయిచంద్ గారి మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ్ముడు సాయిచంద్ అకాల మరణం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదన్నారు. భౌతికంగా మన మధ్య లేకున్నా, పాట రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
మంత్రి కే తారకరామారావు సంతాపం
తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు సంతాపం. తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు తన సంతాపం తెలిపారు. సాయి చంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కేటీఆర్, యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప గాయకున్ని, భవిష్యత్ నాయకున్నీ కోల్పోయిందని ఆయన తెలిపారు. తన ఆట పాటలతో తెలంగాణ ఉద్యమంలో అలాగే తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం లో సాయి చందు పాత్ర విశేషమైనదని ఆయన అన్నారు.సాయి చందు గారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రార్ధించారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కవిగాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మరణవార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. సాయి చంద్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సాయిచంద్ స్వరం తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచింది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తి తో పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప కళాకారున్ని కోల్పోయింది. మంచి భవిష్యత్తు ఉన్న సాయిచంద్ మరణం తెలంగాణకు తీరని లోటు. సాయిచంద్ చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం బాధాకరం
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దిగ్భ్రాంతి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్,తెలంగాణ ఉద్యమ కారుడు,గాయకుడు సాయిచంద్ హఠాన్మరం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. నాకు వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగిస్తోంది. ఎప్పుడు ఎదురైనా ఆప్యాయంగా బాల్కొండ బంగారు కొండ మా ప్రశాంత్ అన్న అని పిలిచే తమ్ముడు ఇక లేడంటే నమ్మలేక పోతున్న. తన ఆట,పాటతో తెలంగాణ ఉద్యమంలో గొప్ప స్ఫూర్తి వంతమైన పాత్ర పోషించి,సమాజానికే ఆదర్శంగా నిలిచిన సోదరుడు సాయి చంద్ భౌతికంగా మనకు దూరమైనా,తన గాత్రం రూపంతో మన మధ్య సజీవంగా ఉంటాడు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాశ్ తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజా చైతన్యం తీసుకువచ్చిన ప్రముఖ గాయకుడు. కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మృతి పట్ల శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా. బండ ప్రకాశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం గొప్ప గాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం తన గొంతుకను వినిపించిన సాయిచంద్ లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని బండ ప్రకాశ్ తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు.
గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు
గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యహ్నం గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమయాత్ర ప్రారంభం కానున్నది. కాగా, మరికాసేపట్లో గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు.