हैदराबाद: मेगा फैमिली में जश्न का माहौल है। इसके लिए विशेष कारण बताने की जरूरत नहीं है। मेगास्टार चिरंजीवी के बेटे और हीरो मेगा पॉवरस्टार राम चरण और उपासना माता-पिता बन गये हैं। सोमवार रात अपोलो अस्पताल में भर्ती हुई उपासना ने मंगलवार तड़के एक सुंदर बच्ची को जन्म दिया है। मां और शिशु स्वस्थ हैं।
हाल ही में राम चरण और उपासना ने अपनी शादी की 11वीं सालगिरह मनाई। अब एक और खुशखबरी दी है। 2012 में राम चरण और उपासना की शादी हुई थी। जैसे ही बेटी के जन्म की खबर सामने आई तो मेगा परिजन और फैन्स खुशी से झूम उठे। मिठाइयां बांटी गई।

उपसना अपने पति राम चरण के साथ मां शोभना कामिनेनी और बुआ सुरेखा कोनिदेला के साथ मिलकर सोमवार शाम को अपोलो प्रो हेल्थ हॉस्पिटल गई। वह वीडियो वायरल हो गया। मेगा प्रशंसकों ने दिसंबर में राम चरण और उपासना की एक आधिकारिक घोषणा के साथ जश्न मनाया कि वे माता-पिता बनने जा रहे हैं। इसी बीच एक मौके पर चिरंजीवी ने कहा था कि ऐसी संभावना है कि राम चरण और उपासना को जुलाई में बच्चा होगा। लेकिन इससे पहले ही उनके घर में जश्न का माहौल है।

वहीं हीरो राम चरण फिल्म की शूटिंग को ब्रेक लगाकर अपना सारा वक्त उपासना के साथ बीता रहे हैं। राम चरण वर्तमान में निर्देशक शंकर के साथ ‘गेम चेंजर’ नामक एक बड़ी फिल्म में काम कर रहे हैं। जुलाई महीने में शंकर की फिल्म का शेड्यूल प्लान किया गया है। लेकिन अब राम चरण के अनुरोध पर शेड्यूल को बदलकर अगस्त कर दिया गया है। खबर वायरल हो रही है कि राम चरण अपनी पत्नी उपासना की डिलीवरी के कुछ दिन बाद तक परिवार के साथ वक्त बिताने का फैसला किया।

भारी बजट की यह पान इंडिया फिल्म अगले साल रिलीज होगी। राजनीतिक पृष्ठभूमि से बन रही इस फिल्म में राम चरण दोहरी भूमिका निभा रहे हैं। कियारा अद्वाणी इस फिल्म की नायिका हैं। दिल राजू और सिरीश इस फिल्म के निर्मिता हैं।
తల్లిదండ్రులైన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ – ఉపాసన
హైదరాబాద్: మెగా కుటుంబంంలో సంబర వాతావరణం నెలకొంది. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. సోమవారం రాత్రే అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయిన ఉపాసన మంగళవారం తెల్లవారు జామున ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు.
రీసెంట్‌గానే రామ్‌చరణ్, ఉపాసన తమ 11వ పెళ్లిరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మరో శుభవార్తను తెలియజేశారు. వీరికి 2012లో వివాహం అయ్యింది. పాప పుట్టిన సంగతి తెలియగానే కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు సంతోషంగా ఉన్నారు.
భర్త రామ్ చరణ్‌తో పాటు తల్లి శోభన కామినేని, అత్తమ్మ సురేఖ కొణిదెలతో కలిసి సోమవారం సాయంత్రం అపోలో ప్రో హెల్త్ హాస్పిటల్‌కు ఉపాసన వెళ్లారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. డిసెంబర్‌లో రామ్ చరణ్, ఉపాసన కలిసి తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ అధికారికంగా చేసిన ప్రకటనతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ జూలైలో చరణ్, ఉపాసనలకు బిడ్డ పుట్టే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఇంకా ముందుగానే వారింట సంబర వాతావరణం నెలకొంది.
మరో వైపు హీరో రామ్ చరణ్ సైతం సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ తన సమయాన్నంతా ఉపాసనకే కేటాయిస్తూ వస్తున్నారు. ఆయన దర్శకుడు శంకర్‌తో కలిసి గేమ్ చేంజర్ అనే భారీ సినిమా చేస్తున్న సంగతి విదితమే. జూలై నెలలో శంకర్ మూవీకి సంబంధించిన షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ రిక్వెస్ట్ మేరకు షెడ్యూల్‌ను ఆగస్ట్‌కి మార్చారు. అందుకు కారణం ఉపాసనకు డెలివరీ అయిన కొన్ని రోజుల వరకు రామ్ చరణ్ ఫ్యామిలీతోనే తన సమయం గడపాలని నిర్ణయించుకోవటమే అందుకు కారణమని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వాని హీరోయిన్. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. (ఏజెన్సీలు)
