తెలంగాణ అంటే పోరాటాలు, విప్లవం, ఎదురు తిరగడమే కాదని ఆదిలాబాద్ సాంప్రదాయ జానపద సంగీతం మానవ వికాస జ్ణానం తరతరాల అతిపురాతనమైన నేల సంగీతం భాషకు జీవం. ఈ మట్టిలో “బస్కింగ్ ” అనే పదం ఏడైనా, ఎప్పుడైనా ఇన్నారా? ఇది ఎవరైనా సంగీత బ్రృందం చేసిండ్ర? ఊరురు తిరుగుతూ, ఏడవడితే అన్నే రోడ్ల పక్కన మరియు చౌరస్తల ఆనందంగా పాడడమే అసలైన “బస్కింగ్” ను “చౌరస్తా బ్యాండ్” షురువుజేసింది.
రగ్గుడ్ సంగీతానికి అడ్రస్. దీన్ని యశ్వంత్ బ్రృంద సభ్యులు బాల, అక్షయ్, అనంత్ సంగీతం కొత్త దునియాలోకి మనల్ని పాటలతో తీసుకవోతది! సంగీతం శక్తి, సాధన ఎనకుండి ఏదో నడుపుతుందీళ్ళను. బలమైన గొంతు అది విసిరే పాట ప్రపంచమంతా గొంతు కలుపుతుంది. గాయకుల శరీరాల్లో విద్యుత్ ప్రవహిస్తుందనిపిస్తుంది.
2021 వ సంవత్సరంలో, సెప్టెంబర్ 10 -13వ తేదీల ఉమ్మడి ఆదిలాబాద్ అతిపురాతన జానపద, సాంప్రదాయ వాయిద్యం కళాకారుల పాటలు పాడి వారితో కలిసి “చౌరస్తా బస్కింగ్” తోవ్వేసింది. ఒకటేమో రగ్గుడ్ సంగీతం, ఇంకోటి సాంప్రదాయ పద్ధతిలో పాడే కళాకారులు ఇద్దరు ఒక ప్రపంచాన్ని స్థృష్టించారు. “కంచేలేని దేశం నాది ఎర్రని గొర్రెవో, బుర్రలేని గొర్రెవో ఏది నీ దేశం” అని చౌరస్తా బస్కింగ్ పాట మొదలుపెడితే, ఆదివాసుల రేలారే రేలారే జానపదం రెండు గమ్మతే! కొమురం భీం కొండలు కొత్త సంగీతం కళాశాల అడవిలోకి పిలిచింది.
భారతదేశంలా సాంస్కృతిక వైవిధ్యం భిన్నంగా మనుగడ సాగిస్తుంది. తెలంగాణల సాంప్రదాయ వాయిద్యం కళ, ఆదివాసి కళ చాలా పేరుంది. ఇక్కడ గొండు, కొలాం, పరదాన్ వివిధ పురాతన ఆదివాసీలు జీవనాగరికత ఉంది. అందుకే రకరకాల అతి పురాతన సంగీతం, వాయిద్యం కళాకారులు ఉన్నారు. వీరందరినీ చౌరస్తా బ్యాండ్ “బస్కింగ్” పేరిట వివిధ ప్రాంతాలలో వారితో కలిసి పాటలు పాడి, వారితో కలిసి సాంస్కృతిక పునరుజ్జీవనం చేశారు. అందరిని కలుపుకొని ఒక వారధిని చేయడం ఆలోచన. ఆదివాసీల “సోలా డింసా అట్ర వాజ్య” అంటే పద్దెనిమిది వాద్యాలు, పదహారు న్రృత్యాలు దీంట్లోనే సంగీతం పాటలు, న్రృత్యాలు ఉంటాయి. వీటికనుగుణంగానే జానపద పాటలు సంగీతం పురుడు పోసుకుంది. పండుగల రీతి రివాజులు ముడిపడి ఉంటాయి.
మెడ్సబ, అనే స్త్రీల తంతులో బొడ్డు శుద్ధి కార్యక్రమం జరిపినప్పుడు పుట్టుక వంశాభివృద్ధి కోసం జరిగే సాధారణ విషయం భావింపబడుతుంది. అప్పుడే పుట్టిన పిల్ల/పిలగాడికి సమాజంలోకి ఆహ్వానం పలుకుతూ ప్రతికగ వేలితో పాట (తీగపాకం) అనే పాట పాడుతారు. పాట లయబద్దంగా జానపద సంగీతంగా పాడటం జీవనాగరికత కదా!
“మాంచెస్టర్ ఆఫ్ హైదరాబాద్” అంటే మంచిర్యాలకు “లంబాడిపల్లి, మై విలేజ్ షో” కాన్నుంచి షురువు జేసి, ఈడ కచ్చినం మైదానం ప్రాంతంలో రోడ్లమీద పాటలు పాడటం కొత్తకదా! అందరు యూత్ ఎంజాయ్ చేశారు. అదే సమయంలో వినాయక చవితి పండుగ వాతావరణం ఉన్నఈ బస్కింగ్ వైపే యూత్ అట్రాక్షన్ చేసింది.
అక్కడ నుంచి ఆసిఫాబాద్ (జనగాం) చేరుకుని, అంబేద్కర్ చౌరస్తాలో ఓ వైపు వర్షం ఇంకో వైపు జనాలు ఇసుకేస్తే రాలనంత జనం పాటలు కోసం ఎదురుచూపులు వారి ఉత్సాహం చూశాక యశ్వంత్ బ్రృందం “ఊరు వెళ్లి పోతా మామ ఊరెళ్ళి పోతా మామ” అంటూ పాడితే యూత్ వారి ఊరి జ్ణాపకాలతో మదిలో నింపుకున్నరు. చౌరస్తా పాటలు ఆకుపచ్చని అడివిని వసంతమోలే, మోదుగుపూల తీరుగా నిండింది.
భాష , సంస్కృతి, జీవనం రీతులు ఉత్పత్తి విధానం తెలంగాణలో ప్రజలకు ఇతర రాష్ట్రాల కంటే ఒక ప్రత్యేకమైన జ్ణానం వికాసానికి ఉంది. మరీ ఉమ్మడి ఆదిలాబాద్ తెలంగాణకు విశేషమైనది. ఈడ ఆదివాసుల గూడెంలో ఆటగాళ్ళు పాటగాళ్ళు పురాతన సంగీతం వాయిద్యం వాయించేవారు. సంగీత కళను బ్రతికించే వారున్నారు. వాళ్ళు సంగీతం జ్ణానం మేమిటి, కళలను ముందు తరాలకు ఎట్లా తీసుకపోతండ్రు ముందు ఆదివాసీ జానపద కళలు అంతరించిపోయే దశలో ఉన్నాయి! వారు ఎట్లా ఈ విషయం అర్ధం చేసుకుంటున్నారు ఇదంతా ఎందుకు జేయ్యనికే ఆసిఫాబాద్ ధనోర పోతే వాళ్ళతోటి కలిసిపోయి పాడిండ్రు. ఈ ప్రాంతంలో పూర్తిగ ఆదివాసుల గ్రామం చౌరస్తా బ్యాండ్ పూర్తి రగ్గుడ్ పాటలు ఐనా ఏడ నెర్వస్ కాలేదు ముఖాలు చూస్తే అర్థమయ్యింది. అటెన్క
సావర్ ఖేడా గ్రామం పొద్దున్నే వందమంది విద్యార్థులు చౌరస్త బ్యాండ్ బస్కింగ్ పాటల కోసం గుమికూడారు. ఆ గ్రామంలోని సంగీతం అద్దినం. ఆడ ప్రాజెక్టు అలలు కూడా పాటలు పాడినయ్ .
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 300కి మీ పొడుగుతా బస్కింగ్ 12 ప్రాంతంలో మమ జరిగింది. మార్లవాయి అతిపురాతన ఆదివాసీ జీవనగ్రామం అక్కడ రాత్రి ఎనిమిది గంటలకు మొదలు పెట్టాం. ఆదివాసీలంతా గుమికూడారు. పద్మశ్రీ కనకరాజు గారూ బస్కింగ్ బ్రృందం పాటలు పాడుతుంటే చప్పట్లుతో జతకలిసాడు. కనక ప్రతిభ వెంకటేశ్వర్లు ఆడి పాడినారు.
ఆదివాసీ యువకులు పాటలు పాడేవారు పాటలు పాడుతూ బస్కింగ్ బ్రృందం భాగమైనారు. ఇదంతా వారికి కొత్త సంగీతం పరిచయం చేసిందని భావించారు. అటునుంచి ఆదిలాబాద్ చౌరస్తాలో గొంతు విప్పితే కొండలు కోనలు జలపాతాలు బస్కింగ్ చేతులు చప్పట్లు కొట్టాయి. ఆ స్వరం ఆదిలాబాద్ రేడియో స్టేషన్ ప్రపంచమంతా తెలిసేలా సుమనస్పతి రెడ్డి గారూ చౌరస్తా బస్కింగ్ ఇంటర్వ్యూని మొదలుపెడితే బ్యాండ్ నిద్రలేని రాత్రులు సంగీతం హోరుని గలగల ఆనందంతో చెప్పుతుంటే బస్కింగ్ సంత్రుప్తినిచ్చిందని వారి మాటలే చెబుతున్నాయి.
ఇంతటి ప్రాముఖ్యత కలిగిన బస్కింగ్ వీడియో డాక్యుమెంటరీ యూట్యూబ్ చానల్ అప్లోడ్ చేయగా ఆ ఆదాయం కళాకారులకు చెందుతుంది యశ్వంత్ నాగ్ మీడియా ముఖంగా చెప్పారు. ఇది గర్వించదగ్గ విషయం. తెలంగాణ సాంస్కృతిక ప్రగతి సాధించాలి. చౌరస్తా బస్కింగ్ ప్రదర్శనలు అంతటా జరగాలి. ఈ కార్యక్రమంలో మర్సుకోల కళావతి కళకు అద్దం పట్టే వారిని కలవాలి.
జూన్ 25వ తేదీన మర్సుకోల కళావతి, తోటి ఆదివాసి మహిళ, గుడిహత్నుర్, అదిలాబాద్ జిల్లా, ప్రపంచం సంగీతం దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వేదిక తన పాటలు పాడి గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గోండు కొలిమి చరిత్రను పాడుతుంటే సభ అంతా ఆస్వాదించారు. కళావతి కర్ణటిక్, గజల్, రాప్ మరియు పోప్ కళాకారులు మధ్యలో కిక్రి, డోలిక్ పాటలు పాడారు. తండ్రి ద్వారా వచ్చిన సంగీతం జ్ణానం ప్రత్యేక ఆదివాసీ సంగీతం ప్రత్యేకతను చూపెట్టింది. ముందు తరాలకు ఇవి కాపాడాలే మరియు ప్రోత్సాహం ఇచ్చేందుకు” చౌరస్త బ్యాండ్” ముందు వీడింది. సంగీత భాషను బతికించుకించుకుందాం అన్న గట్టి మాటను ఆదిలాబాద్ అందరికిచ్చిండు. కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పరోక్షంగా చాటి చెబుతున్నరు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కళాకారులు, అధికారులు రాజకీయ నాయకులు మరియు ఆదివాసి సంఘాలు అందరం సంగీతం తరాలకు అందించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు “చౌరస్తా బస్కింగ్” ట్రైలర్ రెండు నిముషాలు నిడివి విడుదలైంది. పూర్తి వీడియోను జూలై 21వ తేదీన పద్దెనిమిది నిముషాలు విడుదలవుతుంది.ఈ వీడియోను ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రామక్రిష్ణ పూర్, మార్లవాయి, సావర్ ఖేడా, ధనోర ప్రాంతంలో స్క్రీనింగ్ చేస్తున్నాం అని గీతరచయిత అక్కల చంద్రమౌళి మరియు చౌరస్త బ్యాండ్ సభ్యుడు ‘తెలంగాణా సమాచారం’ వెబ్ న్యూస్ కు తెలిపారు.