करंट लगने से आठवीं कक्षा के छात्रा की मौत, मातम में डूबा परिवार

हैदराबाद: आठवीं कक्षा के छात्रा की दुर्घटनावश बिजली का झटका लगने से मौत हो गई। यह दर्दनाक घटना रंगारेड्डी जिले के मंडल के हरियानायक तांडा में हुई है।

पुलिस और तांवासियों के अनुसार, तालाकोंडापल्ली मंडल केंद्र में कस्तूरीबा गांधी जनजातीय आश्रम स्कूल में कक्षा 8वीं कक्षा की छात्रा मुडावत नंदिनी गुरुवार दोपहर संक्रांति की छुट्टियों के लिए घर गई थी। नंदिनी के माता-पिता मुवावत शंकर-शांति हाल ही में एक नया घर बना रहे हैं क्योंकि उनके पास अपना घर नहीं है।

शुक्रवार की सुबह जब वह अपने पिता के निर्देशानुसार नए घर में संप की मोटर चालू करने गई तो नंदिनी के दाहिने हाथ पर तैरती केबल लग गई और उसकी मौके पर ही मौत हो गई। नंदिनी को तुरंत स्थानीय अस्पताल ले जाया गया। डॉक्टरों ने पुष्टि की कि उसकी जान जा चुकी है।

संक्रांति पर्व पर घर आई सबसे छोटी बेटी की आंखों के सामने जान चली गई तो माता-पिता की चीख-पुकार से तांडावासियों की आंखों में आंसू आ गए। नंदिनी की माँ एक आंगनवाड़ी स्कूल में काम करती हैं। बताया जाता है कि नंदिनी छठी कक्षा से कस्तूरीबा स्कूलों में पढ़ रही थी। साथी दोस्तों ने बताया कि नंदिनी पढ़ाई में काफी होशियार थी। मृतक नंदिनी को एक बड़ी बहन है।

కరెంట్ షాక్ తగలి ఎనిమిదవ తరగతి విద్యార్థిని మృతి

హైదరాబాద్: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలి 8వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని హరియా నాయక్ తండాలో చోటు చేసుకుంది.

తండా వాసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మూడవత్ నందిని సంక్రాంతి సెలవుల నిమిత్తం గురువారం మధ్యాహ్నం ఇంటికి వెళ్ళింది. నందిని తల్లిదండ్రులు మూడవత్ శంకర్-శాంతిలు సొంత ఇల్లు లేకపోవడంతో ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నారు.

శుక్రవారం ఉదయం తండ్రి సూచన మేరకు కొత్త ఇంటిలో ఉన్న సంపు మోటర్‌ను ఆన్ చేయడానికి వెళ్లిన సమయంలో కేబుల్ వైరు తేలి ఉండటంతో నందిని కుడిచేయి తగిలి మొత్తం కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నందిని వెంటనే స్థానికంగా ఉండే ఆస్పత్రికి తరలించిన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు.

సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చిన కన్న కూతురు కళ్ళముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు తండావాసులను కన్నీటి పర్యంతానికి గురి చేశాయి. నందిని తల్లి అంగన్వాడీ పాఠశాలలో పనిచేస్తున్నారు. నందిని ఆరవ తరగతి నుండి కస్తూరిబా పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదువులో నందిని చాలా చురుకుగా ఉండేదని తోటి స్నేహితులు తెలిపారు. మృతురాలికి ఒక అక్క ఉంది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X