ప్రవైట్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయనిలకు ఉత్తమ విద్యా సేవా అవార్డులు

నల్లగొండ జిల్లా కేంద్రంలో ట్రస్మా ఆధ్వర్యంలో విద్యా సదస్సు

ప్రవైట్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయనిలకు ఉత్తమ విద్యా సేవా అవార్డులు

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి

పాల్గొన్న శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

సభకు అధ్యక్షత వహించిన ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాస్, పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి, పాపిరెడ్డి బి ఆర్ యస్ నేత సుంకరి మల్లేష్ గౌడ్ తదితరులు

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆధునిక వైద్యం అందుబాటులోకీ వచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. క్యాన్సర్, అంకాలజీతో సహా అన్ని ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకీ వచ్చాయన్నారు. బుధవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రవైట్ పాఠశాలల యజమాన్యాల ఆధ్వర్యంలోనీ ట్రస్మా నిర్వహించిన విద్యా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అంతకు ముందు ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రవైట్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్ పై మంత్రి జగదీష్ రెడ్డి పై విదంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలోనే విద్యా, వైద్య రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయన్నారు. ఏకకాలంలో 8 మెడికల్ కళాశాలలు మంజూరు చేయడం తో పాటు వచ్చే విద్యాసంవత్సరంలో మరో 9 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయబోతున్న సాహసం ముఖ్యమంత్రి కేసీఆర్ దన్నారు.

హెల్త్ కార్డులు అక్కర లేకుండానే ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆధునిక వైద్యం అందుబాటులో ఉందన్నారు. అటువంటి సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మెడికల్ కళాశాలల ఏర్పాటు ద్వారా ప్రతి జిల్లా కేంద్రంలో వందలాది మంది ప్రభుత్వ డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. కాదని ప్రవైట్ ఆసుపత్రికి వెడితే శరీరం తో పాటు జేబు గుల్ల అవుతుందన్న విషయాన్ని విస్మరించ రాదన్నారు.విద్య రంగంలోనూ సంచలనాత్మకమైన మార్పులు సంభవించాయనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకా ఏర్పాటు చేసిన 1000 కీ పైగా గురుకులాలో పెరిగిన సీట్ల రద్దీయే నిదర్శనమన్నారు.

2014 కు పూర్వం ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లకు డిమాండ్ ఉంటే ఇప్పుడు గురుకులలాలకు డిమాండ్ పెరిగిందన్నారు. అయితే నిబంధనల మేరకే సీట్ల కేటాయింపులు ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్తో పోల్చి చూస్తే కార్పొరేట్ విద్యా సంస్థ లలో ఫెయిల్యూర్ లు ఎక్కువన్నారు. ప్రవైట్ పాఠశాలలో పనిచేస్తున్న వారికి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉత్పనం కాదన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రవైట్ ఉపాధ్యాయ, ఉపాధ్యాయనిలకు ఉత్తమ విద్య సేవ అవార్డులను అందించి సత్కరించారు.

రబీ పంట కొనుగోళ్ల పై సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక సమీక్ష

హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి,పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకట్రావు, యస్ పి రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావు తదితరులు

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ లో జిల్లా నుండి కొనుగోళ్ల లక్ష్యం ఏడు లక్షల నాలుగు వేల మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు కేవలం 20 వేల బస్తాలు మాత్రమే సేకరించడం పట్ల మంత్రి జగదీష్ రెడ్డి తవిస్మయం వ్యక్తం చేశారు. 213 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇంత తక్కువ సేకరించడం ఏమిటంటూ అధికారులను ఆయన నిలదీశారు.ధాన్యం కొనుగోళ్ళకు ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

బుధవారం ఉదయం సూర్యపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా యస్ పి రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్ మోహన్ రావు లతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిద శాఖాదిపతులు, రైస్ మిల్లర్లు,ట్రాన్స్ పోర్టు నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోళ్లు వేగవంతం చెయ్యక పోతే చర్యలు తప్పవంటూ ఆయన అధికారులను హెచ్చరించారు.జిల్లాలో 72 రైస్ మిల్లులు ఉండగా 37 మిల్లులు మాత్రమే ధాన్యం కొనుగోలుకు ముందుకు రావడం ఎందని ఆయన అధికారులను ప్రశ్నించారు.

అదే సమయంలో అటు రైస్ మిల్లర్లు ఇటు ట్రాన్స్ పోర్ట్ యజమానులు అలసత్వం ప్రదర్శించ రాదని ఆయన పేర్కొన్నారు. సరిపడ హామిలీలను యుద్ద ప్రాతిపదికన నియమించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు.నాణ్యత ప్రమాణాల పేరుతో కోతలు వలదని ఆయన సూచించారు. అదే సమయంలో రైతులకు నాణ్యత అంశంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీదనే ఉంటుందన్నారు.అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు అధికారులు బాసటగా నిలబడాలని అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.సి యం ఆర్ బియ్యం అక్రమాలపై మంత్రి జగదీష్ రెడ్డి కొరడా ఝళిపించారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారినుండి రికవరీ చెయ్యాలని అధికారులను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.

అంతే గాకుండా డీ-ఫాల్టర్ల పై దృష్టి సారించాలన్నారు.తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన పడొద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అదేశించారన్నారు. అకాల వర్షాలకు పంట నష్టం వివరాలు సే కరిస్తూన్నట్లు ఆయన ప్రకటించారు. మూడు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించి రైతులను ఆదుకుంటామని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల తో పాటు అకాల వర్షాలకు సంభవించిన పంట నష్టంపై చిల్లర రాజకీయాలు తగదని ఆయన విపక్షాలకు ఉద్బోధించారు. వ్యవసాయానికి గౌరవం పేరిగిందీ అంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలువతోటే అన్నది ప్రపంచానికి తెలుసు అని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X