हैदराबाद: संक्रांति पर्व पर एमएलसी कविता को ईडी ने बड़ा झटका दिया है। शराब घोटाला मामले में ईडी ने कविता को सोमवार को नोटिस जारी किया। नोटिस में कहा गया है कि मंगलवार को ईडी के समक्ष सुनवाई में शामिल होना है।
मालूम हो कि ईडी ने कविता को पिछले दिनों नोटिस जारी किया था। इसके अलावा ईडी ने मार्च में शराब घोटाला मामले में कविता से 3 दिनों तक पूछताछ की। अब जैसे-जैसे संसद चुनाव नजदीक आ रहे हैं, एक बार फिर ईडी ने कविता को नोटिस दिया है। इस बार क्या होने वाला है यह दिलचस्प बन गया है।
देखने वाली बात यह होगी कि कविता ईडी की पूछताछ में शामिल होंगी या नहीं। मालूम हो कि कविता ने इससे पहले ईडी के नोटिस के खिलाफ सुप्रीम कोर्ट का दरवाजा खटखटाया था। कोर्ट के निर्देश पर वह ईडी की पूछताछ में शामिल नहीं हुई थी।
లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ నోటీసులు
హైదరాబాద్: సంక్రాంతి పండగ పూట ఎమ్మెల్సీ కవితకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు సోమవారం నోటీసులు జారీ చేసింది. రేపు ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఈడీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక, లిక్కర్ స్కాం కేసులో మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఈడీ కవితకు నోటీసులు ఇవ్వడంతో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.
అయితే ఈడీ నోటీసులు, విచారణ పద్ధతిపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మహిళను ఈడీ ఆఫీసుకు పిలిచి రాత్రి వరకు విచారణ చేయటాన్నివ్యతిరేకిిస్తూ.. సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్ సుప్రీంలో ఉన్న సమయంలోనే గతేడాది సెప్టెంబర్లో ఈడీ మళ్లీ నోటీసులు పంపటంతో.. మరోసారి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీం న్యాయస్థానం మహిళ అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని అభిప్రాయపడింది. అయితే మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో.. నవంబర్ 20 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఈడీకి ధర్మాసనం ఆదేశించింది. కాగా అప్పటి నుంచి మళ్లీ కవిత కేసు విచారణకు రాకపోవటం గమనార్హం. అయితే ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేయటం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే సుప్రీం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు ఈడీ విచారణకు హాజరుకాకూడదని కవిత భావిస్తున్నట్టు సమాచారం. నోటీసులపై న్యాయవాదులతో కవిత చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా రేపు విచారణపై సందిగ్ధత నెలకొంది. (ఏజెన్సీలు)