हैदराबाद: शहह में एक भयानक हादसा हो गया। शनिवार दोपहर 1.22 बजे हैदरगुड़ा ओल्ड एमएलए कॉलोनी में फुटपाथ का एक विशाल पेड़ सड़क पर गिर गया।
ट्रैफिक सिग्नल बंद होने के बाद वहां खड़े दो ऑटो पर पेड़ के गिरने से एक ऑटो चालक की मौत हो गई। चूंकि उस समय ज्यादा ट्रैफिक नहीं था, इसलिए बड़ा नुकसान होने से बच गया।
दोनों ऑटो पूरी तरह क्षतिग्रस्त हो गये। पुलिस ने मृतक ऑटो ड्राइवर की पहचान गौस पाशा के रूप में की है। शव को पोस्टमॉर्टम के लिए उस्मानिया अस्पताल के शवगृह में भेज दिया है।
पेड़ के बगल में लगा बिजली का खंभा भी धराशायी हो गया। इसको लेकर बिजली विभाग के अधिकारी सतर्क हो गये और बिजली आपूर्ति बंद कर दी। डीआरएफ की टीमों ने पेड़ को सड़क से हटा दिया। इसके बाद वाहनों की आवाजाही की अनुमति दे दी गई।
భారీ చెట్టు ఆటోపై పడి డ్రైవర్ మృతి
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం 1:22 గంటల సమయంలో.. హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే కాలనీలో ఫుట్‌పాత్‌పై ఉన్న భారీ వృక్షం నేలకొరిగింది.
ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో అక్కడే ఆగివున్న రెండు ఆటోలపై చెట్టు కూలడంతో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా లేకపోవడంతో భారీ నష్టం తప్పింది.
రెండు ఆటోలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతి చెందిన ఆటో డ్రైవర్‌ను గౌస్ పాషాగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
చెట్టు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూడా కూలిపోయింది. దీంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చెట్టును డీఆర్ఎఫ్ బృందాలు రోడ్డు మీద నుంచి తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలకు అనుమతించారు. (ఏజెన్సీలు)