- సీఎం కేసీఆర్ నిర్మించిన కొత్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంపై బాధ్యతారాహిత్యంగా, విద్వేషపూరిత ప్రకటనలు చేసినందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. బిఆర్ అంబేద్కర్ పేరు మీదున్న సచివాలయాన్ని కించపరిచినందుకు బండి సంజయ్ వ్యాఖ్యలను డాక్టర్ శ్రవణ్ తీవ్రంగా ఖండించారు.
- ‘కొత్త సచివాలయాన్ని కూల్చి వేస్తామని బండి సంజయ్ బాబా సాహెబ్‌ను కూడా కించపరిచారు. నిజాం నిర్మాణ శైలిని తలపిస్తున్నందున తాను సచివాలయంలోకి అడుగుపెట్టనని బండి సంజయ్ చెబుతున్నాడు. మరి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్) సరస్సులను నిజాంలు తవ్వించారు? వాటి నీరు బండి త్రాగలేదా? నిజాం నిర్మించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎందుకు డిగ్రీ తీసుకున్నాడు?” అని బండి సంజయ్‌ని డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
- “మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అన్ని సంస్థలు మరియు సంప్రదాయాలను నాశనం చేసాడు, మొత్తం దేశాన్ని దోచుకున్నాడు. అంతటితో ఆగకుండా అన్ని పిఎస్‌యులను (ప్రభుత్వ రంగ సంస్థలను ) కూడా అమ్ముతున్నాడు. కాని కేసీఆర్, మోదీలా కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తున్నాడు. సీఎం కేసీఆర్ సంపద సృష్టికర్త, తెలంగాణ నిర్మాత,” అని డాక్టర్ దాసోజు శ్రవణ్ బీజేపీ యొక్క తీరును దుయ్యబట్టారు .
హైదరాబాద్ : సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్త సచివాలయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా, విద్వేషపూరిత ప్రకటనలు చేశారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఏఐఎంఐఎం పార్టీని ఆకట్టుకునేందుకే నూతన సచివాలయ డిజైన్‌ను రూపొందించారని, బీజేపీ అధికారంలోకి వస్తే దానిని కూల్చేస్తామని అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై డాక్టర్ శ్రవణ్ ఫైర్ అయ్యారు.
సికింద్రాబాద్‌లోని తార్నాకలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ నేతృత్వంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో డాక్టర్ దాసోజు శ్రవణ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే విధ్వంసక, విభజన రాజకీయాలకు మాత్రమే పేరెన్నికగన్న పార్టీ అన్ని విమర్శించారు . కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా ఎన్నుకోవడం ద్వారా కాషాయ పార్టీ దుందుడుకు, తప్పుడు చర్యలకు స్వస్తి పలకాలని డాక్టర్ శ్రవణ్, తెలంగాణ ప్రజలను కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించడమే కాకుండా బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని, తెలంగాణ ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనంగా సీఎం కే చంద్రశేఖరరావు కొత్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించారని, ఇది ఎప్పటికి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ కొత్త సచివాలయంపై అనవసర వివాదాలు సృష్టిస్తోందని డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు.
ఒవైసీలను సంతోషపెట్టే విధంగా కొత్త సచివాలయ భవనానికి రూపకల్పన చేశామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారని, ఇది బీజేపీ నేతల పూర్తి బాధ్యతారాహిత్యం, విద్వేషపూరిత ధోరణి తప్ప మరొకటి కాదని, కేసీఆర్ ఏనాడూ ఏ కులం, మతంపై వివక్ష చూపలేదన్నారు. తెలంగాణాలో అన్ని వర్గాలు శాంతి, సౌభాగ్యాలతో జీవిస్తున్నాయని పేర్కొన్నారు .అయితే బీఆర్ అంబేద్కర్ పేరిట నిర్మించిన కొత్త సచివాలయాన్ని కూడా రాజకీయం చేసేందుకు బీజేపీ కుటిల బుద్ది ప్రదర్శిస్తుందన్నారు. నూతన సచివాలయాన్ని నిర్మించడం పట్ల యావత్ తెలంగాణ సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో, దానిని బండి సంజయ్ కూల్చాలనుకోవడం దురదృష్టకరం. బీజేపీ వేస్తున్న విభజన వ్యూహాల పాచికలో తెలంగాణ ప్రజలు పడరన్న విషయాన్ని బండి సంజయ్ గ్రహించాలి అని డాక్టర్ దాసోజు శ్రవణ్ బండి సంజయ్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘కొత్త సచివాలయాన్ని కూల్చి వేస్తామని బండి సంజయ్ బాబా సాహెబ్‌ను కూడా కించపరిచారు. నిజాం నిర్మాణ శైలిని తలపిస్తున్నందున తాను సచివాలయంలోకి అడుగుపెట్టనని బండి సంజయ్ చెబుతున్నాడు. మరి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్) సరస్సులను నిజాంలు తవ్వించారు? వాటి నీరు బండి త్రాగలేదా? నిజాం నిర్మించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎందుకు డిగ్రీ తీసుకున్నాడు?” అని బండి సంజయ్‌ని డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
బీజేపీపై విరుచుకుపడిన డాక్టర్ శ్రవణ్, విధ్వంసకుడైన ప్రధాని మోదీలా కాకుండా, సీఎం కేసీఆర్ సంపద సృష్టికర్త మరియు దేశ నిర్మాత అని వాదించారు.
“2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అన్ని సంస్థలు, సంప్రదాయాలను ధ్వంసం చేశారు. దేశాన్ని మొత్తం దోచుకుంటున్నారు, తన స్నేహితుడు అదానీకి లబ్ధి చేకూర్చేందుకు అన్ని పీఎస్‌యూలను కూడా అమ్మేస్తున్నారు. కానీ మోదీలా కాకుండా సీఎం కేసీఆర్ సంపద సృష్టికర్త, తెలంగాణ నిర్మాత,” అని డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు.
కేసీఆర్ తెలంగాణను సాధించడమే కాకుండా అన్ని విధాలుగా సుపరిపాలన, సంక్షేమ పథకాలతో సంపన్న రాష్ట్రంగా మార్చారని తెలిపారు. రైతుబంధు, దళిత బంధు, రూ.2000 వృద్ధాప్య పింఛన్లు, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు . భారతదేశం నలుమూలల నుండి ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని గుర్తు చేసారు. బీఆర్‌ఎస్ త్వరలో మతతత్వ బీజేపీకి గుణపాఠం చెబుతుందని డాక్టర్ దాసోజు శ్రవణ్ ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు తలసాని సాయికిరణ్, మోతె శోభన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Dasoj Shravan strongly condemned Bandi Sanjay’s comments for defaming the Secretariat named after BR Ambedkar
- BRS senior leader Dr Dasoju Sravan admonished Telangana BJP president and MP Bandi Sanjay for making irresponsible and hate mongering statements on the new Dr BR Ambedkar Secretariat constructed by CM KCR.
- “By uttering to demolish the new Secretariat, Bandi Sanjay is humiliating even Baba Saheb on whose name the Secretariat is built. Bandi Sanjay is saying that he will not enter the Secretariat as it resembles Nizam’s construction style. Then will he not drink water from Himayatsagar and Osman Sagar (Gandipet) lakes as they were created by Nizams? Why did he take a Degree from Osmania University which was built by Nizams?” questioned Dr Dasoju Sravan lambasting Bandi Sanjay.
- “Since Modi took over as PM, all the institutions and traditions have been destroyed. He is looting the entire nation and even selling all PSUs. No wonder Bandi Sanjay feels it right to demolish the newly built BR Ambedkar Secretariat, which reflects the aspirations of Telangana people. But unlike Modi, CM KCR is the creator of wealth and builder of Telangana” stressed Dr Dasoju Sravan, mocking BJP.
Hyderabad, May 1: BRS senior leader Dr Dasoju Sravan admonished Telangana BJP president and MP Bandi Sanjay for making irresponsible and hate mongering statements on the new Dr BR Ambedkar Secretariat constructed by CM K Chandrashekar Rao. Dr Sravan fired on Bandi Sanjay for saying that the new Secretariat design was conceived to impress the AIMIM party and it will be demolished if BJP comes to power.
Speaking at the BRS party’s Athmeeya Sammelan held under the leadership of Assembly Deputy Speaker T Padma Rao Goud at Tarnaka, Secunderabad, Dr Dasoju Sravan launched a tirade on BJP. Saying that BJP is known only for destructive and divisive politics, Dr Sravan urged Telangana people to put an end to saffron party’s draconian and misguided acts, by electing KCR as the CM for the third time.
“Chief Minister K Chandrashekar Rao has not just achieved Telangana but building it into a Golden Telangana. The new Dr BR Ambedkar Telangana State Secretariat has been constructed by CM K Chandrashekar Rao as testament to Telangana’s progress and glorious future. It will go down in history as one of the greatest places. Unable to digest this, BJP has been creating unnecessary controversies over the new Secretariat,” said Dr Dasoju Sravan.
“BJP Telangana president Bandi Sanjay is saying that the new Secretariat building design has been conceived to make Owaisis happy. This is nothing but complete irresponsibility and hate mongering by BJP leaders. KCR has never discriminated against any caste or religion and ensured that people belonging to all sections live with peace and prosperity. But crooked minds of BJP are trying to politicize even the new Secretariat constructed in the name of BR Ambedkar. It is unfortunate Bandi Sanjay wants to demolish the Secretariat which is being hailed and celebrated by the entire Telangana. Bandi Sanjay should realise that Telangana people will not fall for the divisive tactics of BJP,” stressed Dr Dasoju Sravan coming down heavily on Bandi Sanjay.
“By uttering to demolish the new Secretariat, Bandi Sanjay is humiliating even Baba Saheb on whose name the Secretariat is built. Bandi Sanjay is saying that he will not enter the Secretariat as it resembles Nizam’s construction style. Then will he not drink water from Himayatsagar and Osman Sagar (Gandipet) lakes as they were created by Nizams? Why did he take a Degree from Osmania University which was built by Nizams?” questioned Dr Dasoju Sravan lambasting Bandi Sanjay.
Upping the ante against BJP, Dr Sravan reasoned that unlike PM Modi, who is a destructor, CM KCR is a creator of wealth and builder of nation.
“Since Narendra Modi took over as PM in 2014, all the institutions and traditions have been destroyed. He is looting the entire nation and even selling all PSUs to benefit his friend Adani. No wonder Bandi Sanjay feels it right to demolish the newly built Secretariat which reflects the aspirations of Telangana people. But unlike Modi, CM KCR is the creator of wealth and builder of Telangana,” said Dr Dasoju Sravan.
“KCR has not just achieved Telangana braving all odds but turned it into a prosperous state with good governance and welfare schemes. Schemes like Rythu Bandhu, Dalit Bandhu, Rs 2000 old age pensions, Mission Bhagiratha, Kalyana Lakshmi, Shaadi Mubarak, KCR kit and others have brought new light in the lives of poor and middle class families. People from all over India are wishing for KCR rule. BRS will soon teach a lesson to communal and regressive BJP,” vowed Dr Dasoju Sravan speaking on the occasion.
GHMC deputy Mayor Srilatha Reddy, TRS leaders Talasani Sai Kiran, Mothe Shobhan Reddy and others were present on the occasion.