హైదరాబాద్ : డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ చేస్తున్న సమాజ సేవలు అమోఘం అని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్స్సెస్ అమెరికా డైరెక్టర్ మరియు ప్రొఫెసర్ లావిరి మొర్రో Lavri Mortow అన్నారు. యు ఎన్ టి ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గత 40 సంవత్సరాలుగా సమాజ సేవలో నిరంతరం నిర్విరామంగా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ మేధావుల ఫోరం Telangana Intellectuals Forum రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ ను ఆదర్శంగా తీసుకొని యువకులు, విద్యార్థులు సమాజాభివృద్ధికి కొరకై కృషి చేయాలన్నారు.
1984 సంవత్సరం నుండి 2024 నేటి వరకు నిర్విరామంగా పర్యావరణ పరిరక్షణ, శాంతి, మతసామరస్యం, జాతీయ సమైక్యత ఎయిడ్స్, క్షయ నివారణ గుండె, కిడ్నీ, మలేరియా, కరుణా వైరస్, క్యాన్సర్ మధుమేహం, గుండెపోటు, మాదకద్రవ్యాల వ్యతిరేకంగా, కాలుష్య నియంత్రణ, ధూమపానం, న్యాయ అవగాహన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, గుట్కా, పాన్ మసాలా తదితర అంశాలతో పాటు యువజన విద్యార్థి మహిళా సంక్షేమ అభివృద్ధి కొరకై చేసిన సదస్సులను, ర్యాలీలను గుర్తించి సన్మాన కార్యక్రమానీ నిర్వహించినట్టు ప్రొఫెసర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డేవిడ్ ఏ డైని David ఆ. Daine, ప్రొఫెసర్ ఒలివియా హైనెస్ Olivia Haynes, ప్రొఫెసర్ స్టింగ్టే స్క్బలర్ Stingtay Schvller ప్రొఫెసర్ గాయత్రి తోపాటు ఫ్యాకల్టీ మెంబర్స్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పాల్గొని డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ నుండి ప్రశంసా పత్రం బొక్కితో ఘనంగా సన్మానించారు. గత 40 సంవత్సరాలుగా కేంద్ర ,రాష్ట్ర మంత్రులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జిలు ఇతర స్వచ్ఛంద సేవ సంస్థలతో ఎన్నో అవార్డులను అందుకున్నారని డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ తెలిపారు.
సంబంధిత వార్త-
ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా కొనసాగుతూ నిరంతరం ప్రజా సంక్షేమ అభివృద్ధి కొరకు సేవలందిస్తున్నానని వివరించారు. గత సంవత్సరము గత 40 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలను ఫోటోలు, ఇన్విటేషన్, పత్రికల వచ్చిన ఆర్టికల్స్ ను వివరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డేవిడ్ ఏ డైనినీ డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ శాలువా, పుష్ప గుచం తొ ఘనంగా సన్మానించారు.