हैदराबाद: डॉ जितेन्द्र ने हैदराबाद स्थित डीजीपी कार्यालय में तेलंगाना के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में कार्यभार संभाला। रेवंत रेड्डी की सरकार ने डॉ जितेन्द्र को तेलंगाना के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में नियुक्त किया। नियुक्ति के बाद तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी से तेलंगाना सचिवालय में तेलंगाना के नवनियुक्त पुलिस महानिदेशक (डीजीपी) डॉ जितेन्द्र ने मुलाकात की।
जितेन्द्र अबतक तेलंगाना के गृह मंत्रालय में प्रधान सचिव के पद पर कार्यरत थे। तेलंगाना के डीजीपी डॉ. जितेंद्र ने कहा, “मैंने कार्यभार संभाल लिया है। मैं अपना सर्वश्रेष्ठ सेवा देने की कोशिश करूंगा। मैं सरकार की प्राथमिकताओं को समझता हूं कि हमें कानून और व्यवस्था बनाए रखनी चाहिए और अपराधों को रोकना चाहिए। नारकोटिक्स एक और मुद्दा है। हमने पहले ही नारकोटिक्स के निदेशक की नियुक्ति कर दी है। हम साइबर अपराधों पर भी जोर देते हैं और हमारे पास इसके लिए विशेषज्ञता है। हमारे पास वरिष्ठ अधिकारी हैं जो साइबर अपराधों की देखरेख कर रहे हैं। हम सुनिश्चित करेंगे कि तेलंगाना में शांति बनी रहे। इस पद के लिए मुझ पर विचार करने के लिए मैं सरकार को धन्यवाद देना चाहता हूं।”
नारकोटिक्स पर पुलिस विभाग के उपायों पर जोर देते हुए डीजीपी ने कहा, “सरकार ने स्पष्ट रूप से कहा है कि नारकोटिक्स हमारी प्राथमिकता है जिसके लिए नारकोटिक्स ब्यूरो पहले ही नियुक्त किया जा चुका है। हाल ही में, सीएम ने कुछ वाहनों को हरी झंडी दिखाई है और इसके लिए कुछ मैनपावर मंजूर किए हैं। नारकोटिक्स पर हमारा अच्छा नियंत्रण है।” डॉ जितेन्द्र ने कार्यभार संभालने के बाद सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर पोस्ट किया और लिखा, “मैं तेलंगाना के पुलिस महानिदेशक (डीजीपी) के रूप में कार्यभार संभालकर सम्मानित महसूस कर रहा हूं। मेरी प्रतिबद्धता हमारे राज्य में सभी नागरिकों की शांति, सद्भाव और सुरक्षा सुनिश्चित करने के लिए लगन से काम करना है।
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఆఫీసర్ జితేందర్
హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డా జితేందర్ బాధ్యతలు స్వీకరించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్‌ను తెలంగాణ ప్రభుత్వం డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ డీజీపీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జితేందర్‌కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read-
బాధ్యతల స్వీకరణ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ.. డీజీపీగా అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నార్కోటిక్స్, సైబర్ క్రైమ్‌పై ఎక్కువ ఫోకస్ పెడతామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. కాగా, పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన జితేందర్ 1992 కేడర్ ఐపీఎస్ ఆఫీసర్. తొలుత ఏపీ కేడర్‌లో పని చేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు అలాట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా పనిచేసిన జితేందర్ మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగానూ పని చేశారు. అనంతరం డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఆయన సీబీఐ, గ్రేహౌండ్స్‌లో వివిధ హోదాల్లో వర్క్ చేశారు.
అనంతరం డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్, వరంగల్ డీఐజీగా పనిచేశారు. తర్వాత సీఐడీ, విజిలెన్స్‌లో వర్క్ చేయడంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేసిన జితేందర్ ప్రస్తుతం డీజీపీ హోదాలో హోం శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా ఆయనను డీజీపీగా నియమించింది. (ఏజెన్సీలు)