ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు: Ex VC VS ప్రసాద్

హైదరాబాద్: డా. బి. ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ ఆచార్యులు కేతు విశ్వనాథ రెడ్డికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ నెల 22న ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి జ్ఞాపకార్ధం నిర్వహించిన సంతాప సభలో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి సాహిత్య సేవలను గుర్తు చేసుకున్నారు.

మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి. ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య వి. ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ఆచార్య కేతు చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు. విలువలతో కూడిన, ప్రజలు వాడే పొడి పొడి పదాలనే వాళ్లకు అర్ధం అయ్యేలా తన సాహిత్యాన్ని రాశారని అందుకే ఆయన ప్రజల గొప్ప సాహిత్యకారుడిగా గుర్తింపు పొందారని ప్రశంసించారు. వాడుక బాషనే తన రచనా శైలిగా ఎంచుకున్నారని, తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు ఆయన గుర్తు ఉండిపోతారని పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామ రావు మాట్లాడతూ

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. సీతారామ రావు మాట్లాడతూ కేతు విశ్వనాథ రెడ్డి విశ్వవిద్యాలయానికి, తెలుగు శాఖకు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలను విశ్వవిద్యాలయం ఎప్పుడూ గుర్తించుకుంటుందని తెలిపారు.

సంబంధిత వార్త:

అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ…

విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ ఆచార్య కేతుతో తనకు ఉన్న అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. విశ్వవిద్యాలయ పురోగతిలో కేతు పాత్ర ఘననీయంగా ఉందని రానున్న రోజుల్లో ఆయన పేరున అకాడమిక్ బ్లాక్ లో ఓ సమావేశా మందిరానికి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి వీసీ ఆచార్య కె. సీతారామ రావు అంగీకరించారు.

తెలుగు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య ఎస్. వి సత్యనారాయణ మాట్లాడుతూ…

కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య ఎస్. వి సత్యనారాయణ మాట్లాడుతూ ఆచార్య కేతు గొప్ప పరిపాలనాదక్షుడు అని, నిరాడంబరుడు అని పేర్కొన్నారు. చూడడానికి ఎంత సౌమ్యంగా ఉంటారో తనకు నచ్చని అంశాల్లో అంతే కటినంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ…

సాహిత్యకారులు, వీక్షణం ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆచార్య కేతు చూపిన బాటలో ముందుకు వెళ్ళుతూ ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన భాద్యత సాహిత్య కారులపైన ఉందని పేర్కొన్నారు. ఎంత పెద్ద వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటారో తన కన్నా వయసులో చిన్న వారితో కూడా అంతే స్నేహంగా ఉంటారన్నారు.

పాత్రికేయులు ఖదీర్ బాబు మాట్లాడుతూ…

పాత్రికేయులు ఖదీర్ బాబు మాట్లాడుతూ ఆచార్య కేతు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, తెలుగు సాహిత్యం అనే అడవిలో ఆచార్య కేతు మహావృక్షంగా అభివర్ణించారు.

సాహిత్య కారిణి కుప్పిలి పద్మ మాట్లాడుతూ…

సాహిత్య కారిణి కుప్పిలి పద్మ మాట్లాడుతూ ఆచార్య కేతు రాయలసీమ కడప వాసిగా గొప్ప సాహిత్య కారుడిగా పేర్కొన్నారు. రాయలసీమ మాండలికంలో ఆయన రచనలు తెలుగు సాహిత్య కారులను ఆకట్టుకున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో ప్రసంగించారు…

కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఏ.వి.ఆర్.ఎన్. రెడ్డి, సికా డైరెక్టర్ ప్రొ. మధుసూదన్ రెడ్డి, కళ విభాగ డీన్ ఆచార్య షకీలా ఖానం, సైన్స్ విభాగ డీన్ ప్రొ. పుష్ప చక్రపాణి, కృష్ణ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య వి. వెంకయ్య, ప్రొ. సతీష్ రెడ్డి, విశ్వవిద్యాలయ మాజీ అధ్యాపకులు ఆచార్య కుప్పు స్వామి, ఆచార్య ఎం. ఎస్. హయత్, ఆచార్య సి. వెంకటయ్య, తదితరులు ప్రసంగించారు.

సంతాప సభ

సంతాప సభను తెలుగు శాఖ అధ్యక్షులు డా. ఎన్. రజని నిర్వహించగా అన్ని విభాగాల అధిపతులు, డైరెక్టర్స్, డీన్స్, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆచార్య కేతు చిత్ర పటానికి పుష్పాంజలితో ఘనంగా నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X