Continue Update…
Hyderabad: రైతు, భూమి సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా కాలేకరేట్ల ధర్నాలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయి. పలు కలెక్టరేట్లను కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. భారీ ధర్నాలకు రైతుల నుంచి మంచి మద్దతు లభించింది.
వికారాబాద్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గద్వాల్ లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, కరీంనగర్ లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కామారెడ్డి లో షబ్బీర్ అలీ, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలలో నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భూమి.సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లలో వినతి పత్రాలు అందజేశారు
మహబూబ్నగర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో…
మాజీ ఎంపీ మల్లు రవి గారు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఒబెద్దుల కోత్వాల్ గారు, సంజీవ్ ముదిరాజు గారు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ గారు, మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పీసీసీ మెంబర్ మరియు మహబూబ్నగర్ అసెంబ్లీ ఇంచార్జ్ గా కె. ప్రశాంత్ కుమార్ రెడ్డి. కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు మరియు జిఎంఆర్ గారు అలాగే భారీగా తరలిన మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
@వికారాబాద్ కలెక్టరేట్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారి స్క్రోలింగ్ పాయింట్స్…
“ఉద్యమ సమయంలో మన యాస, భాషపై దాడి జరుగుతుందన్నారు. కానీ ఇపుడు మన బతుకులపై దాడి జరుగుతోంది. మన కల్చర్ అగ్రి కల్చర్.. అలాంటి అగ్రికల్చర్ ను కార్పొరేట్ కు కట్టబెట్టాలని చూస్తున్నారు. మళ్లీ రైతులను కూలీలుగా మార్చాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో ఉన్న వారిని గుంజుకొచ్చి జైల్లో పెట్టాలని ప్రధానిని కోరుతున్నా. రాహుల్, సోనియా విచారణ సంస్థలకు సహకరించి వారిని గౌరవించింది. కానీ బీఎల్ సంతోష్, కవిత ఎందుకు విచారణకు హాజరు కావడంలేదు? తెలంగాణ సమాజం అంతా గమనిస్తోంది.”
“కాంగ్రెస్ పార్టీ పై కుట్ర చేసి సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారు. రైతు బీమా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్… పంట నష్టానికి బీమా ఎందుకివ్వడం లేదు? పంట బీమా ఇవ్వని కేసీఆర్ రైతుల చావులకు వెలకడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సాయం చేయాలంటే రైతు చావాల్సిందేనా? ఎనిమిదేళ్లు కలిసున్న బీజేపీ, టీఆరెస్ ఇప్పుడు డ్రామాలు చేస్తున్నాయి. 80వేల మంది రైతులకు రైతు బీమా వచ్చిందని వ్యవసాయ మంత్రి చెబుతున్నారు. ఐదేళ్లలో 80వేల మంది రైతులు చనిపోయారని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే. అంతమంది రైతులను పొట్టన పెట్టుకున్న కేసీఆర్ సీఎం గా ఉండటానికి వీల్లేదు.”
“మోదీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్ర పెట్టుబడులను గుజరాత్ తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తున్నారు. ఇక్కడ జరిగే దాడులు గుజరాత్ లో ఎందుకు జరగడంలేదు? ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన కేసీఆర్ ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. 2015లో అన్యాయంగా నన్ను జైల్లో పెట్టారు. నా కూతురు పెళ్లికి పోకుండా చేయాలని కుట్ర చేసిన కేసీఆర్. ఇవాళ నీ బిడ్డ ఇంటికి సీబీఐ వచ్చింది. మమ్మల్ని మింగిన పాపం ఊరికే పోదు. పక్క పార్టీలను పతనం చేస్తే అధికారం శాశ్వతం అనుకున్నావ్. అదే ఉసురు నీకు తగిలి నీ పార్టీ పీలికలై పోతది.”
వికారాబాద్ కలెక్టరేట్ వద్ద రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ధర్నాలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెద్ద సంఖ్యలో ధర్నాకు హాజరైన కాంగ్రెస్ శ్రేణులు, రైతులు. ధరణి, భూ సంబంధిత సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్.
Dharna at Peddapally Collector Office and submitted a Memorandum to the District Collector demanding to resolve farmers issues, abolition of Dharani and for immediate steps to resolve the podu land issues. G. Niranjan
Hyderabad: నేడు జిల్లా కేంద్రాలలో టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నాలు. భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై వరస పోరాటాలకు పిలుపునిచ్చిన టీపీసీసీ. ఇప్పటికే మండల, నియోజక వర్గ కేంద్రాలలో ధర్నాలు చేపట్టిన టీపీసీసీ. నేడు జిల్లా కేంద్రాలలో ధర్నాలు. వికారాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి తదితరులు పాల్గొంటారు.