హైదరాబాద్: రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో నేడు రేలియం ఎదుట ధర్నా నిర్వహించారు. విజయవాడలోని రక్ష సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పద్మావతి హాస్పిటల్ 280 రైల్వే స్టేషన్ క్లీనింగ్ కార్మిక కాంటాక్ట్ కార్మికుల్లో 120 మందిని అవుట్ కం వర్క్ బేసిస్ ఒక సాకుతో తొలగించడం జరిగింది.
వీరు 12 సంవత్సరాల నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్నారు. హఠాత్తుగా తొలగించి వీళ్ళని రోడ్డు మీద పడడం జరిగింది. 50 మంది మహిళా కార్మికులు ఈ ధర్నాలో వారిని వెంటనే పనిలో తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూనియన్ తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివిఎల్ నరసింహులు తోపాటు కొందరు కాంట్రాక్ట్ కార్మికులు మరియు ఏఐఆర్ఎఫ్ జాయింట్ జనరల్ సెక్రెటరీ కె శివకుమార్ రైల్ నిలయంలో డిజిఎంజి గారిని కలిసి మెమోరాండం సమర్పించారు. కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని తొలగించబడ్డ కాంటాక్ట్ కార్మికులందరినీ వెంటనే పనిలో తీసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను కోరారు. అలాగే పిసిఎంఈ కూడా మెమోరాండం కాపీని సమర్పించారు.