हैदराबाद: मालूम हो कि नामपल्ली बाजार घाट में एक इमारत में भीषण आग लग गई। सोमवार सुबह हुई इस घटना में 9 लोगों की मौत हो गई और 21 अन्य गंभीर रूप से घायल हो गए। घायलों को उस्मानिया अस्पताल में भर्ती किया गया। घायलों आठ की हालत चिंताजनक बताई गई। इस बीच फायर डीजी नागिरेड्डी ने बाजार घाट अग्निकांड पर अहम बयान दिया। स्पष्ट किया कि आग इमारत में रखे रासायनिक ड्रमों के कारण हुई है। आबादी वाले इलाके में केमिकल के ड्रम रखे हुए थे और वही ड्रम अग्निकांड का कारण बने हैं। आवासीय क्षेत्रों में केमिलक ड्रमों के भंडारण की अनुमति नहीं है।
डीजी ने बताया कि सुबह 9.34 बजे फोन आया कि नामपल्ली बाजार घाट पर आग लग गई है। इसके चलते तुरंत फायर ब्रिगेड मौके पर पहुंच गई। नामपल्ली अग्निकांड में कुल 9 लोगों की मौत हो चुकी है। इमारत में 16 फ्लैट है। आग से वे सब प्रभावित हुए है। इमारत में कोई अग्नि सुरक्षा या फायर सेट बैक नहीं था। उन्होंने बताया कि सेलर के पार्किंग एरिया में केमिकल ड्रम रखे होने की वजह से यह हादसा हुआ। इस बात की जांच कर रहे हैं कि इस अग्निकांड के और भी कोई कारण हैं।
నాంపల్లి అగ్ని అగ్ని ప్రమాద ఘటనపై DG నాగిరెడ్డి కీలక ప్రకటన
హైదరాబాద్: నాంపల్లి బజార్ ఘాట్‌లో ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా బజార్ ఘాట్ అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు.
భవనంలో నిల్వ ఉన్న కెమికల్ డ్రమ్ముల వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. జనవాసాల మధ్య కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉంచారని, ఆ డ్రమ్ములే ప్రమాదానికి కారణమయ్యాయని వెల్లడించారు. జనవాసాల మధ్య కెమిలక్ డ్రమ్ముల నిల్వకు అనుమతి లేదన్నారు.
ఉదయం 9.34 గంటలకు నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు ఫోన్ వచ్చిందని, వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారని తెలిపారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందినట్లు ప్రకటించారు.
అగ్ని ప్రమాదానికి గురైన భవనంలో మొత్తం 16 ఫ్లాట్లు ఉన్నాయని, భవనానికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ, ఫైర్ సెట్ బ్యాక్ లేదన్నారు. సెల్లార్‌లోని పార్కింగ్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు పెట్టడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. (ఏజెన్సీలు)