దేశ రాజధాని ఢిల్లీలో BRS పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు…

హైదరాబాద్/ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్‌విహార్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గారు ప్రారంభించారు. మొదట బిఆర్ఎస్ భవన్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన కేసీఆర్ గారు ఆ తర్వాత వైదిక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మధ్యాహ్నం 1 గంట. 5 నిమిషాలకు రిబ్బన్‌ కట్‌ చేసి బిఆర్ఎస్ భవన్ ను బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి కె.టి. రామారావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్ సభలో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్‌, వెంకటేష్‌ నేత, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి , ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్‌ చధుని తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ భవన ప్రారంభోత్సవం అనంతరం మొదటి అంతస్తులోని పార్టీ అధ్యక్ష కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని వసంత్‌విహార్‌లోని బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించే సమయంలో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెంట శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కేటీ రామారావు, ప్రశాంత్‌రెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. అనంతరం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఇతర నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

బిఆర్ఎస్ భవన్ ప్రారంభోతోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ భవన్ నుండి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కె. చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం పలుకుతూ పోస్టర్లు, బ్యానర్లు పెద్ద ఎత్తున వెలిశాయి. ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయ ఆవరణలో యాగం, స్తోత్ర పారాయణాలతో శుభకరమైన వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే కార్యాలయ ఆవరణలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బారులు తీరారు. దీంతో బిఆర్ఎస్ భవన్ పరిసరాల్లో కోలాహల వాతావరణం నెలకొంది. భారీ బందోబస్తు మధ్య కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని, పుష్పగుచ్ఛాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

బిఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర తెలంగాణ పోలీసులతో పాటు, ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వసంత విహార్ మెట్రో స్టేషన్ నుండి బిఆర్ఎస్ భవన్ వరకు భద్రత కట్టుదిట్టం చేయబడింది. సాధారణ వాహనాల రాకపోకలు కాసేపు నిలువరించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బీఆర్‌ఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం జరిగింది.

వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం అత్యంత వైభవోపేతంగా బిఆర్ఎస్ భవన్ కార్యాలయం రూపుదిద్దుకున్నది. బిఆర్ఎస్ మొదటి అంతస్తులో పార్టీ అధ్యక్షుని కార్యాలయం ఉంది. ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిండెంట్ లకు ప్రత్యేక ఛాంబర్లు కేటాయించడం జరిగింది. వీటితో ఇతర అవసరాల కోసం మొత్తం పద్దెనిమిది గదులు భవన్ లో ఉన్నాయి. పార్టీ సమావేశాల కోసం భవన్ లో విశాలమైన సమావేశ మందిరాన్ని కేటాయించారు. దేశ రాజధాని కేంద్రంగా బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభం కావడంతో పార్టీ విస్తరణ పనులు వేగవంతం కానున్నాయి.

బి ఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్/ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని వసంత్ వివర్ లో బి ఆర్ ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ “యావత్ దేశ ప్రజలు కెసిఆర్ గారి నాయకత్వం కావాలని కోరుతున్నారని,దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి దేశానికి ఆదర్శం నిలిచిందని అన్నారు. కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టిన పక్క ప్రణాళికతో మొదలు పెట్టి ముగిసే వరకు విశ్రాంతి తీసుకోరని ఆయన చెప్పారు. బి ఆర్ యస్ పార్టీ దేశ రాజకీయాలలో ప్రథమ స్థానంలో నిలిచి ,దేశాభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

मुख्यमंत्री ने वैदिक रीति से पूजा अर्चना की, फीता काटकर राजधानी में बीआरएस भवन का किया उद्घाटन

नई दिल्ली/हैदराबाद : मुख्यमंत्री के चंद्रशेखर राव ने वृहस्पतिवार को को राजधानी के वसंत विहार स्थित बीआरएस भवन का उद्घाटन किया। दिल्ली स्थित बीआरएस भवन पार्टी का केन्द्रीय कार्यालय है। मुख्यमंत्री ने वैदिक रीति से पूजा अर्चना की। इसके बाद कार्यालय परिसर में ध्वजारोहण किया। वैदिक मंत्रोच्चारण और स्तोत्र पाठ के बीच उन्होने एक बजकर पांच मिनट पर फीता काटकर राजधानी में बीआरएस भवन का विधिवत उद्घाटन किया।

इस अवसर पर विधान सभा स्पीकर पोचारम श्रीनिवास रेड्डी, राज्य सभा में बीआरएस संसदीयदल के नेता के. केशव राव, लोक सभा में बीआरएस संसदीयदल के नेता नामा नागेश्वर राव, आईटी मंत्री केटी रामाराव, सड़क और भवन मंत्री प्रशांत रेड्डी, सांसद जोगिनापल्ली संतोष कुमार, बीबी पाटिल, वी रविचंद्र, वेंकटेश नेता, मालोत कविता, बि. लिंगय्या यादव, एमएलसी पल्ला राजेश्वर रेड्डी, विशेष प्रतिनिधि मल्ला जगन्नाथ और बीआरएस किसान प्रकोष्ठ के अध्यक्ष गुरनाम सिंह चढूनी उपस्थित थे।

बीआरएस भवन के उद्घाटन के बाद मुख्यमंत्री केसीआर ने प्रथम तल पर बने पार्टी अध्यक्ष के कार्यालय में पदभार संभाला और दस्तावेज पर दस्तखत किए। दिल्ली के वसंत विहार स्थित बीआरएस केन्द्रीय कार्यालय कक्ष में पदभार ग्रहण करने के समय विधान सभा अध्यक्ष पोचारम श्रीनिवास रेड्डी, मंत्री प्रशांत रेड्डी, केटी रामाराव, जोगिनपल्ली संतोष कुमार और प्रभाकर रेड्डी उपस्थित थे। उन्होने काम काज भी किया। इसके बाद पार्टी के वरिष्ठ नेताओं द्वारा उन्हें बधाई देने का तांता लगा रहा। बधाई देने वालों में सभी सांसद, मंत्री और पार्टी कार्यकर्ता शामिल थे।

बीआरएस भवन के लगभग दो किलोमीटर के दायरे में पार्टी अध्यक्ष के चंद्रशेखर राव के पोस्टर, बैनर भरे पड़े थे। बीआरएस केन्द्रीय कार्यालय परिसर में यज्ञ और स्तोत्र पाठ सबह शुरू हो गया। भारी संख्या में बीआरएस कार्यकर्ता कार्यालय परिसर में सुबह से मौजूद थे। परिसर में गहमा गहमी का वातावरण रहा। भारी सुरक्षा के बावजूद पार्टी कार्यकर्ता गुलदस्ता लिए मुख्यमंत्री केसीआर के आगमन की प्रतीक्षा करते रहे और उनके आगमन पर भरपूर स्वागत किया। बीआरएस केन्द्रीय कार्यालय के उद्घाटन के बाद पार्टी नेताओं और कार्यकर्ताओं का उत्साह बढ गया।

तेलंगाना पुलिस के साथ दिल्ली पुलिस ने बीआरएस भवन के पास भारी सुरक्षा इंतजाम किया था। वसंत विहार मेट्रो स्टेशन से बीआरएस भवन तक सरक्षा घेरा कड़ा था। सामान्य वाहन का परिचालन बंद रहा। कडी सुरक्षा व्यवस्था के बीच बीआरएस केन्दीय कार्यालय का उद्घाटन समारोह आयोजित हुआ।

बीआरएस भवन को वास्तु के अनुरूप बनाया गया है। इसके प्रथम तल पर पार्टी अध्यक्ष का कार्यालय है। अध्यक्ष और कार्यकारी अध्यक्ष के विशेष कक्ष हैं। इसके अलावा कुल अठारह कमरे हैं। कांफ्रेस हॉल भी है। वसंत विहार स्थित केन्द्रीय कार्यालय से बीआरएस पार्टी के काम काज में तेजी आएगी और पार्टी के विस्तार का काम तेज होगा।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X