हैदराबाद: ईडी के अधिकारियों ने दिल्ली शराब घोटाले में आरोपों का सामना कर रही बीआरएस एमएलसी कविता से कल 10 घंटे से अधिक समय तक पूछताछ की। इसलिए कविता फिलहाल दिल्ली में हैं। बीआरएस सूत्रों ने बताया कि मंगलवार को सुबह 11 बजे दिल्ली स्थित ईडी कार्यालय आने के लिए समन भेजा गया है।
कविता कल सुबह 10.30 बजे ईडी ऑफिस पहुंची थीं। इसके बाद से कविता को रात 9 बजे तक ईडी दफ्तर में ही रहना पड़ा। चूंकि इस बात की कोई आधिकारिक जानकारी नहीं है कि उनसे अलग-अलग पूछताछ की गई या अन्य आरोपियों के साथ मिलकर। इसके हर मीडिया अलग-अलग कथन देते रहे हैं। अंदर क्या हुआ यह कोई नहीं जानता था। कविता रात 9 बजे के बाद ईडी ऑफिस से बाहर निकलीं। वे अपने काफिले में दिल्ली के तुगलक रोड स्थित सीएम केसीआर के निवास पर चली गई। तेलंगाना के अलावा पूरे देश में यही चर्चा है कि क्या कविता गिरफ्तार होगी या नहीं।
संबंधित खबर:
నేడు మళ్లీ ED ముందుకు MLC కవిత, వదలని ఈడీ అధికారులు
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న BRS ఎమ్మెల్సీ కవితను నిన్న 10 గంటలకు పైగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. మళ్లీ ఇవాళ రావాల్సిందిగా సమన్లు పంపారు. అందువల్ల కవిత ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకి రావాల్సిందిగా సమన్లు పంపినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కవితను అరెస్ట్ చేస్తారా లేదా అని తెలంగాణతో పాటు దేశం మొత్తం చర్చించుకుంటున్నారు.
నిన్న ఉదయం 10.30కే ఈడీ ఆఫీసుకి వచ్చారు కవిత. అప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆమె ఈడీ ఆఫీసులోనే ఉండాల్సి వచ్చింది. లోపల ఆమెను విడిగా ప్రశ్నించారా లేక ఇతర నిందితులతో కలిపి ప్రశ్నించారా అనే దానిపై అధికారిక సమాచారం లేకపోవడంతో ఒక్కో మీడియా ఒక్కోలా కథనాలు ఇస్తోంది. లోపల ఏం జరిగింది అన్నది మాత్రం ఎవరికీ కచ్చితంగా తెలియదు. రాత్రి 9 తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. తన సొంత కాన్వాయ్‌లో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లో ఉన్న సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు.
ఢిల్లీ మద్యం కేసులో కవితకు ఈడీ ముందుగా మార్చి 8వ తేదీన నోటీసులు జారీ చేసింది. 9న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించింది. దీంతో 11న వస్తానన్న కవిత తాను చెప్పిన తేదీ ప్రకారమే ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లగా అప్పుడు అధికారులు దాదాపు 8గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
ఈనెల 16వ తేదీన మరోసారి విచారణకు రావాలని 11వ తేదీనే మళ్లీ ఈడీ సమన్లు ఇవ్వగా మార్చి 15న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ నెల 24న విచారణకు రావాల్సి ఉన్న క్రమంలో అప్పటివరకు వేచి చూడాలని ఈడీని కోరుతూ లేఖ రాశారు. గత విచారణలో అధికారులు కోరిన సమాచారాన్ని తన తరఫు న్యాయవాది భరత్‌తో పంపారు. అదే రోజు ఈడీ అధికారులు ఈ నెల 20న తమ ఎదుట విచారణకు రావాలని నోటీసులు పంపగా కవిత సోమవారం విచారణకు హాజరయ్యారు.(ఏజెన్సీలు)