हैदराबाद: तेलंगाना में इस साल नये पंजीकृत मतदाताओं में 18-19 वर्ष के आयु वर्ग के 83,207 लोग हैं। ये सभी पहली बार मतदान के अधिकार का प्रयोग करेंगे। इस हद तक, मुख्य चुनाव अधिकारी (सीईओ) विकास राज ने गुरुवार को राज्य मसौदा मतदाताओं की सूची की घोषणा की। इसके अनुसार, इस महीने की 9 तारीख तक, राज्य भर में 2,95,80,736 मतदाता हैं।
इस सूची में किसी को कोई आपत्ति होने पर 15 दिन के भीतर चुनाव अधिकारी के पास अपील करनी होगी या फॉर्म-6 जमा करना होगा। मसौदा मतदाता सूची में तेलंगाना भर में 1,47,02,391 महिला मतदाता और 1,48,58,887 पुरुष मतदाता हैं। सेवा मतदाताओं की संख्या 15,067, एनआरआई मतदाता 2,737 और ट्रांसजेंडर मतदाता 3,858 हैं। सीईओ ने खुलासा किया कि डबल फोटो, लगातार बदलाव और अन्य कारणों से राज्य में सूची से लगभग 11,36,873 वोट हटा दिए गए हैं।
इसी क्रम में पिछले साल 3,03,56,894 मतदाता थे। चुनाव आयोग द्वारा घोषित मसौदे के अनुसार, इस बार 2,95,80,736 मतदाता हैं। पिछली बार की तुलना में इस बार वोटों की संख्या में 7,76,153 की कमी आई है। इसी तरह, तेलंगाना के 119 निर्वाचन क्षेत्रों में मतदान केंद्रों की संख्या बढ़कर 34,891 हो गई है, जबकि पिछले साल 34,867 थे।
రాష్ట్రంలో కొత్త ఓటర్లు 83,207
తెలంగాణలో ఈ ఏడాది కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిలో 18-19 ఏళ్ల వయసు వారు 83,207 మంది ఉన్నారు. వీరంతా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికా్‌సరాజ్ గురువారం ప్రకటించారు. దీని ప్రకారం ఈనెల 9 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నారని సీఈవో తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో ఎన్నికల అధికారికి అప్పీలు చేసుకోవాలని, లేదంటే ఫారమ్-6ను సమర్పించాలని పేర్కొన్నారు.
ఓటరు జాబితా ముసాయిదాలో రాష్ట్రవ్యాప్తంగా 1,47,02,391 మంది మహిళా ఓటర్లు, 1,48,58,887 మంది పురుష ఓటర్లు ఉన్నారని.. సర్వీసు ఓటర్ల సంఖ్య 15,067, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 2,737 మంది, ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 3,858 ఉన్నట్లు వివరించారు. డబుల్ ఫొటోలు ఉండటం, నిరంతర మార్పులు, ఇతర కారణాల వల్ల రాష్ట్రంలోని జాబితా నుంచి దాదాపు 11,36,873 ఓట్లను తొలగించామని సీఈవో వెల్లడించారు.
కాగా, గతేడాది 3,03,56,894 మంది ఓటర్లు ఉండగా ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా ప్రకారం ఈసారి 2,95,80,736 మంది ఉన్నారు. గతంతో పోల్చితే ఈసారి 7,76,153 ఓట్ల సంఖ్య తగ్గింది. అదే విధంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల పరిధిలో గతేడాది 34,867 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి సంఖ్య 34,891కి పెరిగింది.