हैदराबाद: जीडिमेटला पुलिस ने दसवीं कक्षा की छात्रा द्वारा अपनी मां की हत्या के मामले में आरोपी को गिरफ्तार कर न्यायिक हिरासत में भेज दिया है। डीसीपी सुरेश कुमार ने बुधवार को बालानगर डीसीपी कार्यालय में आयोजित मीडिया के सामने इस हत्या मामले में बड़ा खुलासा किया। उन्होंने बताया कि बेटी ने उनके प्रेम प्रसंग में मां के बीच में आने और उसे बुरी तरह से प्रताड़ित भी कर रही मानकर नफरत करने लगी। इसी क्रम में सोमवार को रात करीब 7-8 बजे उसने अपने प्रेमी शिवा (19) और उसके छोटे भाई (16) के साथ मिलकर मां की हत्या कर दी। इस आरोप में दोनों नाबालिगों को जुवेनाइल होम भेज दिया गया और शिवा को गिरफ्तार कर लिया।
डीसीपी ने आगे बताया कि शाहपुर नगर के न्यू एलबी नगर की रहने वाली अंजलि (39) की दो बेटियां हैं। वह स्थानीय सरकारी स्कूल में पढ़ती है। दसवीं कक्षा में पढ़ने वाली छात्रा (15) की इंस्टाग्राम पर शिवा नामक एक युवक से परिचय हो गया। यह परिचय प्यार में बदल गया और दोनों परिवारों को इस बारे में पता भी चला। इसके बाद शिवा अक्सर मृतक अंजलि के घर आता-जाता था। अंजलि ने पहले दोनों के प्यार को मान लिया, लेकिन बाद में इसका विरोध करने लगी। फिर भी दोनों ने प्रेम प्रसंग को जारी रखा। इसके चलते अंजलि ने कईं बार बेटी को डांटा और बुरी तरह से पिटाई की।
उन्होने यह भी खुलासा किया कि अंजलि को पहले पति से एक और दूसरे पति से दो बेटियाँ हैं। पहली बेटी की शिकायत है कि उसकी मां पहले पति से पैदा हुई बेटी से भी दूसरी पति से पैदा हुई बेटी ज्यादा प्रेम करती है। तीन साल पहले यानी जब लड़की सातवीं कक्षा में थी, तो उसने थाने में जाकर अंजलि के खिलाफ़ शिकायत दर्ज कराई कि उसकी मां अक्सर उसके सात मारपीट करती है। इसके बाद भी वह अंजलि के पास ही रह रही थी। इस दौरान अंजलि बेटी को कई मौकों पर उसने प्रताड़ित भी किया। इतना ही नहीं अंजलि ने आठ महीने तक अपने प्रेम संबंध को स्वीकार किया, लेकिन बाद में नहीं दोनों को प्रेम प्रसंग को ठुकरा दिया। इसके कारण लड़की ने माँ अंजलि पर दुश्मनी बड़ा ली।
डीसीपी ने यह भी बताया कि इस महीने के दूसरे सप्ताह में लड़की और उसकी छोटी बहन शिवा के घर में चार दिन तक रही है। इसके बाद अपनी मां अंजलि के दबाव में आकर बालिका घर वापस आ गई। इस महीने की 18 तारीख की रात को लड़की घर से कुछ नकदी और सोना लेकर शिवा के साथ घर छोड़कर भाग गई। इसके चलते 19 तारीख को अंजलि ने जीडिमेटला थाने में शिकायत दर्ज की। पुलिस ने 20 तारीख को लड़की को वापस लाकर उसकी मां अंजलि को सौंप दिया। मां की शिकायत के आधार पर मामला दर्ज करने वाली पुलिस को लड़की की मेडिकल जांच और शिवा को मंगलवार को अदालत में पेश करना था।
हालांकि, इस बीच लड़की ने अपने प्रेमी शिवा पर अपनी मां की हत्या के लिए दबाव बनाया। जब शिवा ने ऐसा करने से इनकार कर दिया, तो उसने उसकी बात न मानने पर आत्महत्या करने की धमकी दी। इसके साथ ही शिवा ने अपने छोटे भाई (16) के साथ मिलकर अंजलि की हत्या कर दी।
Also Read-
తల్లిని హత్య చేయించిన పదవ తరగతి విద్యార్థిని కేసులో నిందితుడు అరెస్టు
హైదరాబాద్ : తల్లిని హత్య చేయించిన పదవ తరగతి విద్యార్థిని కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు జీడిమెట్ల పోలీసులు. ఈ మేరకు బుధవారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రేమ వ్యవహారంలో అడ్డు రావటమే కాకుండా తీవ్రంగా హింసిస్తున్న తల్లి పట్ల ద్వేషం పెంచుకున్న బాలిక (15) తన ప్రేమికుడు అయినా శివ (19) , అతని తమ్ముడు (16) తో కలిసి సోమవారం రాత్రి 8 గంటల సమయంలో హత్య చేయించింది. ఈ ఘటనలో మైనర్లను ఇద్దరిని హోం కు తరలించగా శివని అరెస్టు చేశారు పోలీసులు.
షాపూర్ నగర్ న్యూ ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్న అంజలి (39) కి ఇద్దరు కూతుర్లు. మీరు స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక (15) కి ఇంస్టాగ్రామ్ లో శివ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారడం, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడం జరిగింది. అనంతరం శివ మృతురాలి అంజలి ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుంటాడు. వీరి ప్రేమను అంజలి ముందుగా ఒప్పుకొని తర్వాత ఆక్షేపించింది. అయినప్పటికీ వీరి ప్రేమ విహారం జరుగుతూ వస్తుండటంతో పలుమార్లు అంజలి బాలికను తీవ్రంగా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
అంజలి మొదటి భర్తకు ఒకరు, రెండో భర్తకు ఒకరు ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో మొదటి భర్తకు పుట్టిన బాలిక కన్నా రెండో భర్త ద్వారా పుట్టిన తన చెల్లిని ప్రేమగా చూసుకుంటుందని మదనపడుతూ వస్తుండేది బాలిక. తరచుగా బాలికను కొట్టడం తిట్టడం వంటివి చేస్తూ ఉండటంతో మూడు సంవత్సరాల క్రితం బాలిక ఏడవ తరగతి చదువుతున్న సందర్భంలో పోలీస్ స్టేషన్కు వచ్చి తల్లి అంజలిపై ఫిర్యాదు చేసింది. అనంతరం బాలిక అంజలి వద్దనే ఉన్నది. అయినప్పటికీ వివిధ సందర్భాలలో బాలికను హింసించడం జరుగుతూ రావడం, ఎనిమిది నెలలుగా వీరి ప్రేమ వ్యవహారం విషయంలో ముందుగా ఒప్పుకొని తర్వాత ఒప్పుకోకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో బాలిక తల్లి అంజలి పై కక్ష పెంచుకుంది.
ఈనెల రెండో వారంలో బాలిక, తన చెల్లెలు శివ ఇంట్లో నాలుగు రోజులు ఉన్నారు. తల్లి అంజలి బలవంతం మీద బాలిక ఇంటికి వచ్చింది. ఈనెల 18న రాత్రి సమయంలో బాలిక ఇంట్లో ఉన్న కొంత నగదు, బంగారాన్ని తీసుకొని శివతో వెళ్ళిపోయింది. 19న అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 20న బాలికను తీసుకొని వచ్చి తల్లి అంజలికి అప్పగించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం బాలికకు వైద్య పరీక్షలు, శివుని కోర్టులో హాజరపరచడం జరగాల్సి ఉండేది.
అయితే ఇంతలోనే బాలిక తన ప్రేమికుడైన శివ తో తన తల్లిని చంపేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ముందు శివ ఒప్పుకోకపోవడం తో తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో శివ తన తమ్ముడు (16) తో కలిసి వచ్చి అంజలి నీ హత్య చేశాడు. ఈ ఘటనలో పోలీసులు శివ ను అరెస్టు చేశారు. కాగా శివ ప్రస్తుతము ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతూ డీజే ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. (ఏజెన్సీలు)
