हैदराबाद : तेलंगाना के काकतीय मेडिकल कॉलेज पीजी की छात्रा धारावत प्रीति के आत्महत्या के प्रयास मामले में आरोपी सैफ को पुलिस ने गिरफ्तार कर लिया है। सैफ के खिलाफ एससी और एसटी Atrocity Act और रैगिंग का मामला दर्ज किया गया है। वरंगल एसीपी बोनाला किशन ने एक बयान में यह जानकारी दी।
एसीपी ने आगे कहा कि पीड़िता और उसके रिश्तेदारों द्वारा दर्ज कराई गई शिकायत के आधार पर जांच की जा रही है। उन्होंने बताया कि उन्हें पता चला कि सैफ पिछले कुछ समय से वॉट्सऐप चैटिंग के जरिए प्रीति को परेशान कर रहा था। पूछताछ के दौरान आरोपितों से कुछ जानकारी भी जुटाई गई। उन्होंने साफ कर दिया कि जो भी गलती करेगा उसे कानून के सामने सजा दी जाएगी।
सोशल मीडिया पर आ रही खबरें बिना प्रीति के मामले की पूरी जांच के प्रसारित करना सही नहीं हैं। सभी से अनुरोध है कि इस मामले में संयम बरतना चाहिए। वहीं प्रीति के पिता शुरू से ही सैफ पर आरोप लगाते रहे हैं। सैफ अपनी बेटी की आत्महत्या के प्रयास के लिए जिम्मेदार हैं।
दूसरी ओर, राज्यपाल तमिलिसाई ने निम्स में इलाज करा रहीं प्रीति से मुलाकात की। उन्होंने कहा कि उनकी तबीयत नाजुक है। राज्यपाल ने प्रीति के शीघ्र स्वस्थ होने और चिकित्सक की सहायता से वापस आने की कामना की। इस मामले में कई घटनाक्रम हैं। इसलिए अभी क्या हुआ यह कहना संभव नहीं है। सभी छात्रों को हिम्मत से काम लेने का सुझाव दिया।
వైద్య విద్యార్థిని ప్రీతి కేసులో నిందిడిపై ర్యాగింగ్, అట్రాసిటీ చట్టం కేసు
హైదరాబాద్ : కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఇదే విషయాన్ని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
బాధితురాలు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని వరంగల్ ఏసీపీ తెలిపారు. ప్రీతిని సైఫ్ గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు వాట్సాప్ చాటింగ్ ద్వారా గుర్తించామని చెప్పారు. విచారణలో నిందితుడి వద్ద నుండి కూడా కొంతమేరకు సమాచారం సేకరించామన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులేనని స్పష్టం చేశారు.
ప్రీతి కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరగకుండానే సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం సరైనది కాదని, ఈ విషయంలో అందరూ సంయవనం పాటించాలని కోరారు. మరోవైపు మొదటి నుంచి కూడా ప్రీతి తండ్రి సైఫ్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్యాయత్నానికి సైఫే కారణమని చెబుతున్నారు.

ప్రీతి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉంది
మరోవైపు నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రీతిని గవర్నర్ తమిళి సై పరామర్శించారు. ఆమె ఆరోగ్యం క్రిటికల్‌గానే ఉందని అన్నారు. వైద్యానికి సహకరించి ప్రీతి త్వరగా కోలుకుని తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కేసులో చాలా పరిణామాలు జరిగాయని ఏం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. స్టూడెంట్స్ అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పారు.
ఈ కేసులో విచారణ పూర్తి స్థాయిలో జరగాలని గవర్నర్ తమిళి సై పోలీసులను కోరారు. ప్రతీ చాలా క్లెవర్ స్టూడెంట్ అని విన్నాను. తాను ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకమని చెప్పారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. (ఏజెన్సీలు)