हैदराबाद : तेलंगाना में POCSO मामले में आरोपी को 20 साल सश्रम कारावास और 10 हजार रुपये की सजा सुनाई गई है। गजवेल एसीपी रमेश के मुताबिक, सिद्दीपेट जिले के जगदेवपुर मंडल के तिम्मापुर गांव के पोसानीपल्ली रमेश (28) नवंबर 2021 में उसी गांव के चार साल की लड़की को चॉकलेट की आस दिखाकर अपने घर ले गया और उसके साथ दुव्र्यवहार किया। अपर जिला एवं सत्र न्यायाधीश ने दोषी पाए जाने के बाद रमेश को 20 साल कैद और जुर्माने की सजा सुनाई।
एक अन्य मामले में आरोपी को…
दूसरी ओर नारायणपेट जिला सत्र न्यायाधीश ने लड़की का यौन उत्पीड़न करने वाले अपराधी को चार साल के कठोर कारावास की सजा सुनाई और 10,000 रुपये का जुर्माना लगाया। मरीकाल थाना क्षेत्र के गांव की 10वीं कक्षा की छात्रा (14) के साथ कोंडा रवि (23) ने प्रेम के नाम पर प्रताड़ित कर रहा था। अप्रैल 2022 में वह युवती के घर गया और प्रताड़ित किया। सत्र न्यायाधीश एम डी रफी ने आरोपी को जुर्माने के साथ चार साल कठोर कारावास की सजा सुनाई।
Crime News : పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
హైదరాబాద్ : పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. గజ్వేల్ ఏసీపీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోసానిపల్లి రమేశ్(28) అదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల పాపకు చాక్లెట్ ఇస్తానని చెప్పి 2021 నవంబరులో ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. నేరం రుజువవడంతో అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి రమేశ్ కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
మరో కేసులో నాలుగేండ్లు
నారాయణపేట: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నేరస్తుడికి నాలుగేండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ నారాయణపేట జిల్లా సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు. మరికల్పోలీస్స్టేషన్పరిధిలోని గ్రామానికి చెందిన పదో తరగతి బాలిక (14)ను కొండ రవి (23) ప్రేమ పేరుతో వేధించేవాడు. 2022 ఏప్రిల్లో బాలిక ఇంట్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. సెషన్స్జడ్జి ఎండీ రఫీ నిందితుడికి నాలుగేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధించారు. (ఏజెన్సీలు)