విషయం:- హైదరాబాదులో ఎంఎంటీఎస్ రైల్వే వ్యవస్థ నిర్వీర్యం అవుతున్నది, గాడిన పెట్టండి,
రైళ్ల సంఖ్యను పెంచాలి, సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి
నగరంలో సామాన్య ప్రజలకు అత్యంత అందుబాటులో, చౌకగా ప్రయాణించగలిగే ఎంఎంటీఎస్ రైల్ ప్రజలకు దూరం అవుతున్నాయి. రైళ్లు తగ్గిపోవడం, సమయపాలన లేకపోవడం, మరమ్మత్తుల పేరుతో రైళ్లు నిరంతరం రద్దు అవుతుండడం వల్ల ఎంఎంటీఎస్ ప్రయాణం పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు. ఎంఎంటీఎస్ ఫేస్ 2 కు సంబంధించిన నాలుగు రూట్లలో రోజుకు ఒక్కటి రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఫలక్నుమా- లింగంపల్లి మధ్యలో కూడా రోజుకు రెండు రైళ్లు మాత్రమే నడుపుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఎంఎంటిఎస్ రైళ్లు స్టేషన్ బయట చాలా సేపు ఆగవలసి వస్తున్నది, దీనితో ఎంఎంటీఎస్ చాలా ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి.
ఎంఎంటీఎస్ మొదటి దశ రూట్లలో ప్రతిరోజు 1,80,000 మంది ప్రయాణించేవారు, రెండో దశ రూట్లతో కలుపుకొని ప్రతిరోజు 5 లక్షలపైగా ప్రయాణించగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం రోజుకు 40000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఎంఎంటిఎస్ రైళ్ల నిర్వహణలో తీవ్ర వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. రెండోదశ అభివృద్ధి కోసం 900 కోట్లు ఖర్చుపెట్టినప్పటికి బూడిదలో పోసిన పన్నీరు లాగా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.
చర్లపల్లి రైల్వే టర్మినల్ ను త్వరలో ప్రారంభించబోతున్నారు, 25 రైళ్లు అదే స్టేషన్ నుండి ప్రారంభమై అక్కడికే చేరనున్నాయి. చర్లపల్లి స్టేషన్ నుండి ఎంఎంటీఎస్ లు సరిపడ వేసి రెగ్యులర్ గా నడిపించకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్య పరిస్థితి ఏర్పడుతుంది.
ఇది కూడ చదవండి-
ఎం ఎం టి ఎస్ రైళ్ల సంఖ్యను పెంచాలని, రెండో దశలో నిర్మించిన రూట్లన్నింటిలో తగినన్ని రైళ్లు నడపాలని, రైళ్ల సమయపాలన పాటించాలని, మరమ్మత్తుల పేరుతో నిరంతరం రైళ్ళను రద్దు చేయడం ఆపాలని రైల్వే అధికారులను కోరినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. పై సమస్యలను పరిష్కరించి ఎంఎంటీఎస్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎం శ్రీనివాస్, సిపిఎం సిటీ సెక్రటరీ
గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ