सावधान! भारत में फिर वापस आ गया है कोरोना, सरकार ने जारी की यह चेतावनी

हैदराबाद: देश में कोरोना के मामले बढ़ने और केरल में नए वेरिएंट के मामले दर्ज होने से केंद्र सरकार सावधानी बरत रही है। हमारे देश में अब एक नया वैरिएंट सामने आया है। वर्तमान में 38 देशों में JN.1 सब वैरिएंट के मामले सामने आये हैं। हालाँकि, इसने सभी राज्य और केंद्र शासित प्रदेश सरकारों को आगामी त्योहारी सीज़न के कारण सावधानी बरतने की चेतावनी दी। इसने सुझाव दिया कि आरटीपीसीआर परीक्षण बढ़ाए जाये और नए प्रकार के मामलों की पहचान के लिए जीनोम अनुक्रम परीक्षण किये जाये।

केंद्रीय स्वास्थ्य सचिव सुधांश पंत ने राज्यों और केंद्र शासित प्रदेशों की सरकारों को पत्र लिखा है। इसमें कहा गया है कि वायरस के प्रसार के पैटर्न पर बारीकी से नजर रखी जाये और जहां मामले अधिक सामने आते हैं वहां नियंत्रण के उपाय किए जाये। उन्होंने कहा कि कोरोना नियंत्रण उपायों के तहत लोगों को नए वैरिएंट के बारे में जागरूक किया जाये। इस बीच, केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मंडाविया इस महीने की 20 तारीख को चिकित्सा अधिकारियों के साथ कोरोना मामलों सहित श्वसन रोगों की बढ़ती संख्या पर समीक्षा करेंगे।

हाल ही में कोरोना के मामले बढ़ते जा रहे हैं। केंद्रीय स्वास्थ्य मंत्रालय के अधिकारियों ने बताया कि सोमवार को देशभर में इस वायरस से संक्रमित लोगों की संख्या 1,828 तक पहुंच गई। केरल में इस महीने की 8 तारीख को नए वेरिएंट JN.1 का मामला दर्ज किया गया और रविवार को एक पीड़ित की मौत हो गई। हालाँकि, ये वैरिएंट मामले भारत के अलावा 38 देशों में सामने आए हैं। केंद्र ने विश्व स्वास्थ्य संगठन (डब्ल्यूएचओ) के निर्देशों के अनुसार उचित सावधानी बरतने के लिए एक सलाह जारी की है। बुजुर्ग लोगों और कमजोर प्रतिरक्षा प्रणाली वाले लोगों को अधिक सतर्क रहने की सलाह दी है।

జాగ్రత్తగా ఉండండి! కరోనా భారతదేశంలోకి తిరిగి వచ్చింది, ప్రభుత్వం చేసింది ఈ హెచ్చరిక

హైదరాబాద్: దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించడం, కేరళలో కొత్త వేరియంట్​కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ మన దేశంలో ఇప్పుడు బయటపడింది, ప్రస్తుతం 38 దేశాల్లో ఈ జేఎన్.1 సబ్ వేరియంట్​కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. అయితే, రాబోయేది పండగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్​ పరీక్షలను పెంచాలని, కొత్త వేరియంట్​ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంశ్​ పంత్​ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తి క్రమాన్ని నిశితంగా పరిశీలించాలని, కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా కొత్త వేరియంట్​పై ప్రజలలో అవగాహన పెంచాలని చెప్పారు. కాగా, కరోనా కేసులు సహా ఇతరత్రా శ్వాసకోశ వ్యాధులు పెరుగుతుండడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఈ నెల 20న వైద్యాధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు.

కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 1,828 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8న కేరళలో కొత్త వేరియంట్​(జేఎన్.1) కేసు నమోదు కాగా ఆదివారం ఓ బాధితుడు మరణించాడని వివరించారు. అయితే, ఈ వేరియంట్ కేసులు​ భారత్​ తో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లు మరింత అలర్ట్​గా ఉండాలని సూచించింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X