హైదరాబాద్: తెలంగాణలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు డా బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం మూడవ రోజు కొనసాగింది.
యూనివర్సిటీ ప్రాంగణంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పలువురు రెగ్యులర్ అధ్యాపకులు, అధ్యాపకేతర సంఘాల నాయకులూ సంఘీభావం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ‘చలో ఉస్మానియా’ కార్యక్రమానికి కూడా డా బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు తరలివెళ్లి మద్దతు పలికారు.
డా బి ఆర్ అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘము అధ్యక్షుడు డా. కె. అవినాష్, ప్రధాన కార్యదర్శి డా. ఎం. కిషోర్ మాట్లాడుతూ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని, ఆలోపు యూజీసీ పే స్కేల్ (బేసిక్, డిఎ, హెచ్ఆర్ఎ, 3 శాతం ఇంక్రిమెంట్) ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Also Read-
ఈ నిరసన కార్యక్రమంలో సలహాదారులు డా. కాసం విజయ్, ఉపాధ్యక్షులు కె. ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి డా. పి. రాధాకృష్ణ, కోశాధికారి డా. వై. కుమార్, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు డా. మఖ్డోం మోయుదుద్దిన్ , డా. నాగిళ్ల రామకృష్ణ, కాంట్రాక్టు అధ్యాపకులు డా. విజయ ఉషశ్రీ , డా. సిద్ధాంతి అరుణ, డి. శ్రీవేణి, నర్సయ్య భట్టు, డా. కురుమేటి దయాకర్, బి. రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
अनुबंध सहायक प्राध्यापकों की हड़ताल
हैदराबाद: तेलंगाना के विश्वविद्यालयों में कार्यरत अनुबंध सहायक प्राध्यापकों को नियमित करने की मांग को लेकर राज्य संयुक्त कार्रवाई समिति के आह्वान पर डॉ. बी. आर. अंबेडकर मुक्त विश्वविद्यालय में अनुबंध सहायक प्राध्यापकों द्वारा शुरू की गई अनिश्चितकालीन हड़ताल बुधवार को तीसरे दिन भी जारी रही।
विश्वविद्यालय परिसर में अम्बेडकर प्रतिमा के समक्ष विरोध प्रदर्शन किया गया। कई नियमित शिक्षकों और गैर-शिक्षण संघों के नेताओं ने भी एकजुटता व्यक्त की। डॉ. बी. आर. अम्बेडकर मुक्त विश्वविद्यालय के कई अनुबंध संकाय सदस्य भी उस्मानिया विश्वविद्यालय में आयोजित ‘चलो उस्मानिया’ कार्यक्रम का समर्थन करने आए।
