हैदराबाद : राजभवन में जमकर अफरा तफरी का माहौल रहा है। राजभवन का घेराव करने की कोशिश कर रहे कांग्रेस नेताओं को पुलिस ने रोक दिया। कांग्रेस नेताओं को हिरासत में लेकर थाने ले गये। सीएलपी नेता भट्टी विक्रमार्क, मुलुगु विधायक सिताक्का और अन्य कांग्रेस नेताओं को पुलिस ने गिरफ्तार कर लिया। पुलिस ने नेताओं के साथ कार्यकर्ताओं को भी गिरफ्तार किया।
इसी क्रम में राजभवन में कांग्रेस कार्यकर्ताओं और पुलिस के बीच धक्का-मुक्की हुई। पुलिस कार्यकर्ताओं को जबरदस्ती वैन में भरकर थाने ले गई। अदानी घोटाले की जांच की मांग को लेकर भट्टी विक्रमार्क के नेतृत्व में कांग्रेस नेताओं ने एक विशाल रैली के साथ गांधी भवन से रवाना हुए। इसके चलते राजभवन में पुलिस को पहले ही अलर्ट कर दिया गया था। राजभवन की ओर जाने वाले रास्ते को बंद कर दिया गया।
राजभवन पहुंचे कांग्रेस नेता घेरने की कोशिश की। पुलिस ने नेताओं को गिरफ्तार किया। इससे राजभवन में कुछ देर के लिए तनावपूर्ण माहौल बन गया। एआईसीसी ने प्रधान मंत्री मोदी द्वारा अदानी को देश की संपत्ति लूटने के मुद्दे पर एक संसदीय समिति गठित करने की मांग करते हुए देशव्यापी विरोध प्रदर्शन का आह्वान किया है। इस आह्वान के अनुसार टीपीसीसी के तत्वावधान में चलो राजभवन कार्यक्रम आयोजित किया गया।
అదానీ స్కాం : రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత, భట్టి, సీతక్క అరెస్ట్
హైదరాబాద్ : రాజ్‌భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజ్‌భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేతలతో పాటు కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు బలవంతంగా కార్యకర్తలను వ్యాన్‌లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదానీ స్కాంపై విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ నుంచి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీతో బయలుదేరారు. దీంతో రాజ్‌భవన్ వద్ద పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. రాజ్‌భవన్ వైపు వెళ్లే రోడ్డును మూసివేశారు.
కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్ వద్దకు చేరుకుని ముట్టడించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రాజ్‌భవన్ వద్ద కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశంలో ప్రధాని మోడీ దేశ సంపదను అదానీకి దోచి పెట్టి అక్రమాలకు పాల్పడిన అంశంపై పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం చేపట్టారు.
కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు పట్టుకుని గాంధీ భవన్ నుంచి ర్యాలీగా రాజ్‌భవన్ వద్దకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఢిల్లీలో అదానీ వ్యవహారంపై 18 విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. (ఏజెన్సీలు)