TPCC కమిటీలు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం, స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దక్క లేదు స్థానం

Hyderabad: కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించింది. ఈ రెండు కమిటీల్లో స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి స్థానం దక్క లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. మాణిక్కం ఠాకూర్ ఛైర్మన్‌గా 18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని కూడా నియమించింది. అలాగే తెలంగాణకు జగ్గారెడ్డి, అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్‌గౌడ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది అధిష్ఠానం. అంతే కాకుండా.. 26 జిల్లాల్లో కొత్త అధ్యక్షులకు బాధ్యతలు అప్పజెప్పింది. ఇకపోతే.. హైదరాబాద్ మహానగరాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసిన అధిష్ఠానం.. వేర్వేరుగా భాధ్యలు అప్పజెప్పింది. విభజించి బాధ్యతలు అప్పగించారు.

మరోవైపు…. ఇదంతా భాగానే ఉన్నా.. రేవంత్ కొత్త టీంలో సీనియర్ లీడర్, ప్రచార కమిటీ ఛైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు మాత్రం ఎక్కడా వినిపించకపోవటం గమనార్హం. గత కొంత కాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. కోమటిరెడ్డి వ్యవహార శైలి నేపథ్యంలో.. ఆయన పేరు ఇప్పుడు కొత్త కమిటీల్లో ఎక్కడా కనిపించకపోవటంపై పెద్ద చర్చే జరుగుతోంది.

రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియామకం అయినప్పటి నుంచే ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం.. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మరింత తలనొప్పింగా మారింది. సొంత పార్టీ నేతలపైనే ఆయన చేస్తున్న కామెంట్లతో.. ఇప్పటికే రెండు సార్లు షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు.

ఇదిలా ఉంటే.. ఈమధ్య తిరుమల శ్రీవారి దర్శానికి వెళ్లిన వెంకట్ రెడ్డి.. ఆసక్తికర స్టెట్‌మెంట్లు చేశారు. ప్రస్తుతానికి తాను పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నానని చెప్పటంతో ఆగకుండా.. తాను ఏ పార్టీలో చేరతానన్నది ఎన్నికలకు ఒక నెల ముందుగా డిసైడై చెప్తానని బాంబు పేల్చారు.

మరోవైపు.. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి మాణిక్యం ఠాగూర్ ఛైర్మన్‌గా ఉండగా.. రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, రేణుకా చౌదరి, బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, శ్రీధర్ బాబు, సంపత్ కుమార్, వంశీ చంద్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ రెండు కమిటీల్లోను స్టార్ క్యాంపెనర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పక్కన పెట్టింది. గతంలో షోకాజ్ నోటీసుకు ఆయన ఇచ్చిన వివరణ సరిగా లేనందుకే రెండు కమిటీల్లో నియమించలేదని కాంగ్రెస్ లో ప్రచారం నడుస్తోంది. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X