కేసీఆర్ విస్మరించిన పది హామీలను సూచిస్తూ పది తలల రావణ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: గడిచిన తొమ్మిది సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా దశాబ్ది ఉత్సవాల పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేయడానికి ఖండిస్తూ పీసీసీ పిలుపుమేరకు నేడు చొప్పదండి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, నియోజకవర్గ ఇంచార్జి మేడిపల్లి సత్యం గారితో పాటు పలువురు నాయకులు హజరై విస్మరించిన 10 హామీలను సూచిస్తూ ఏర్పాటుచేసిన పది తలల రావణ కేసీఆర్ దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది.
బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం గత 21 రోజులుగా దశాబ్ది ఉత్సవాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా హంగామా నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసే విధంగా కెసిఆర్ విస్మరించిన 10 హామీలను సూచిస్తూ పది తలల రావణ కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారు.
ప్రధానంగా అమలు చేయని హామీలైన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల ఉద్యోగాలు, గిరిజన, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పోడు భూముల పట్టాల పంపిణీ ఇలాంటి అనేకమైన హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు అని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం.
ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందింది, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఏ ఆలోచనతో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారో అందుకు అనుగుణంగా సామాజిక సంక్షేమ తెలంగాణ ప్రజలకు అందించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని తెలియజేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపుమేరకు 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరుగుతుంది.
దిష్టిబొమ్మల దహనంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనువిప్పు కలిగి ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చి సమీక్షించుకొని ఈ మూడు నెలల సమయంలో హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలని లేదంటే చరిత్రహీనులుగా నిలిచిపోతారని అన్నారు.