ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ములుగు సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు.

చాలా వరకు రాజకీయ పార్టీలు తమకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోవని కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా రాష్ట్ర ఏర్పాటు చేసిందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐం ములాఖత్ అయ్యాయని తెలంగాణ సీఎం అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిరద్శనం అన్నారు.

మీరు బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. సీఎం కేసీఆర్ గతంలో అనేక హామీలు ఇచ్చారని దళితులకు మూడు ఎకరాలు భూమి, ఉద్యోగాలు, రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ప్రజల ధనాన్ని కేసీఆర్ తన జేబులో వేసుకున్నారని ధ్వజమెత్తారు.

కానీ తాము అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చాం. కర్నాటకలో మేము ఐదు గ్యారెంటీలు ఇచ్చామని మొదటి కేబినెట్‌లోనే హామీలు నెరవేర్చామన్నారు. తామిచ్చిన హామీలు నెరవేరుతున్నాయో లేదో కర్నాటక వెళ్లి చూడాలి.

మేము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటాం. ఆదివాసీల భూములు, మీ హక్కులు వాపస్ ఇస్తామని నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తున్నామని తప్పక నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు.

రాహుల్ గాంధీ

బీఆరెస్ హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసింది

మూడెకరాల భూమి,రైతు రుణమాఫీ.. ఇలా ఏ హామీని నెరవేర్చలేదు.

రాజస్థాన్ లో ఆరోగ్య పథకం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోంది

రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఛత్తీస్ గడ్ లో వారి ధాన్యాన్ని అధిక ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.

దేశంలో ఎక్కడా లేని విధంగా వార్ ధాన్యానికి ఛత్తీస్ గడ్ లో ఎక్కివ ధర చెల్లించి కొంటున్నారు.

కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేసి చూపింది.

రాష్ట్రంలో పోడు, అసైన్డ్ భూముల విషయంలో అందరికీ న్యాయం చేస్తాం

మేం ఏ మాట ఇచ్చామో అది నిబెట్టుకున్నాం…

తెలంగాణలోనూ మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపుతాం

దేశంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం

తెలంగాణలో బీఆరెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ..

తెలంగాణలో బీఆరెస్ గెలవాలని బీజేపీ కోరుకుంటోంది

వీరికి ఎంఐఎం మద్దతు ఇస్తోంది

కాంగ్రెస్ ను ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి

తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది

హైదరాబాద్: ములుగు జిల్లా పాలంపేట కు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. హెలీప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, ఇతర నేతలు.
రామప్ప ఆలయానికి చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు.

ప్రసిద్ధ రామప్ప దేవాలయం లో ప్రాచీన శిల్ప కళ నైపుణ్యాలను అడిగి తెలుసుకున్న రాహుల్ ప్రియాంక. రామప్ప దేవాలయం చరిత్ర గురించి రాహుల్, ప్రియాంకలకు వివరించిన ఆలయ నిర్వహకులు.

హైదరాబాద్: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, టి. సుబ్బిరామిరెడ్డి, రేణుక చౌదరీ, షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, నిరంజన్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్, సమీరుల్లా, ఫేహెం ఖురేషి, ఫేహీం, మెట్టు సాయి కుమార్ తదితరులు.

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రామప్ప దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆరు గ్యారంటీలను శివుడి ముంది పెట్టి భక్తితో పూజిస్తారు. శివుడిపై నాకూ విశ్వాసం ఉంది. శివుడిని దర్శించుకుని బస్సు యాత్ర మొదలు పెడతారు. మొదటిరోజు ములుగు, భూపాలపల్లి పరిధిలో మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు. రెండో రోజు కరీంనగర్ జిల్లాలో, మూడో రోజు నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర ఉంటుంది.

Rajiv Gandhi Sadbhavana Yatra Commemoration Day at Charminar on 19th October 2023 at 10.30 AM
Veteran Trade Union leader Sri G. Sanjeeva Reddy, Ex-MP wiil be honored with “Sadbhavana Award”

Congress Party flag will be hoisted, where Rajiv Ji hoisted the Party Flag in the year 1990.

Sri Mansoor Ali khan, AICC Secretary Sri N Uttamkumar Reddy, MP, Smt Deepadas Munshi, CWC Member, Sri K Jana Reddy, Former CLP Leader , V.Hanumanth Rao, Ex- MP, Sri Anjankumar Yadav, Ex- MP , Sri M.Kodanda Reddy, Vice President AICC kisan Congress and others will participate.

——————————-

రాజీవ్ గాంధీ సద్భావన యాత్రా స్మారక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19 వ తేదీన చారిత్రాత్మక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సమావేశము జరుగుతోంది.

1990 లో రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జండా ను ఎగుర వేసిన చోట కాంగ్రెస్ పార్టీ ఫతాకాని ఎగుర వేస్తారు.

ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఐఎన్‌టియుసి అధ్యక్షుడు మరియు మాజీ కార్మిక మంత్రి శ్రీ జి. సంజీవ రెడ్డి గారిని “సద్భావన అవార్డు”తో సత్కరిస్తారు

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీ మన్సూర్ అలీ ఖాన్, లోకసభ సభ్యులు శ్రీ ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రేస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలు శ్రీమతి దీపాదాస్ మున్షీ,  , మాజీ మంత్రి శ్రీ కె.జానా రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ వి.హనుమంతరావు, శ్రీ ఆంజన్ కుమార్ యాదవ్,  శ్రీ M. కోదండ రెడ్డి,  AICC కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X