दिल्ली पुलिस के खिलाफ कांग्रेस की तेलंगाना हाई कोर्ट में याचिका दायर, किया यह आग्रह

हैदराबाद : कांग्रेस पार्टी ने अमित शाह के भाषण के वीडियो में बदलाव करने का आरोप लगाते हुए दिल्ली पुलिस द्वारा दर्ज मामले में पार्टी के सदस्यों के खिलाफ सख्त कार्रवाई नहीं करने का आदेश जारी करने के लिए तेलंगाना उच्च न्यायालय का दरवाजा खटखटाया है। इस संबंध में टीपीसीसी के कार्यकारी अध्यक्ष महेश कुमार गौड़ ने याचिका दायर की है। प्रतिवादी के रूप में गृह विभाग, डीजीपी, शहर पुलिस आयुक्त, दिल्ली एसपी, सरकारी कर्मचारी मिराज और शिंकू सरन सिंह को शामिल किया गया है। हाई कोर्ट गुरुवार को इस याचिका पर सुनवाई करेगा।

महेश कुमार गौड़ ने याचिका में कहा कि कांग्रेस की सोशल मीडिया विंग के सचिवों की निजी आजादी छीनने की कोशिश की जा रही है। उन्होंने कहा कि दिल्ली पुलिस ने सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से तेलंगाना में लागू की जा रही कल्याणकारी योजनाओं को बंद कर दिया है। दिल्ली के सरकारी कर्मचारी शिंकू सरन सिंह की ओर से पुलिस को दी गई शिकायत के आधार पर मामला दर्ज किया गया है।

टीपीसीसी के कार्यकारी अध्यक्ष ने कहा कि भाजपा के महासचिव ने वीडियो में छेड़छाड़ के मुद्दे पर हैदराबाद साइबर अपराध पुलिस में शिकायत दर्ज कराई और उस मामले में आरोपियों को गिरफ्तार कर जमानत पर रिहा कर दिया गया। दिल्ली पुलिस ने इसी मुद्दे पर मामला दर्ज किया है। मणिकोंडा में रहने वाली कांग्रेस सलाहकार मंदा श्रीप्रताप के घर में करीब 20 लोग मकान में प्रवेश किया और उनका सामान जब्त कर लिया। दिल्ली पुलिस से तेलंगाना पुलिस को सूचित किए बिना मकान में अवैध प्रवेश के खिलाफ गंभीरता से लेते हुए कार्रवाई करने की अपील की है।

यह भी पढ़ें-

ఢిల్లీ పోలీసులపై తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్ ​పిటిషన్

హైదరాబాద్ : అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షా ప్రసంగ వీడియోలో మార్పులు చేశారంటూ ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ పార్టీకి చెందిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. హోంశాఖ, డీజీపీ, సిటీ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్, ఢిల్లీ ఎస్పీ, ప్రభుత్వ ఉద్యోగులు మీరాజ్, శింకు శరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ప్రతివాదులుగా చేర్చారు. దీన్ని హైకోర్టు గురువారం విచారించనుంది.

కాంగ్రెస్​ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా వింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన పిటిషన్​లో పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంటే ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఢిల్లీలోని ఓ గవర్నమెంట్​ఉద్యోగి శింకు శరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారన్నారు.

వీడియో మార్పు అంశంపై బీజేపీ రాష్ట్ర జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఆ కేసులో నిందితుల అరెస్టు, బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విడుదల జరిగిపోయాయన్నారు. అదే అంశంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం చెల్లదన్నారు. మణికొండలో ఉంటున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంద శ్రీప్రతాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంట్లోకి సుమారు 20 మంది వెళ్లి ఆయన సొంత వస్తువులను సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారన్నారు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ పోలీసులు అక్రమంగా ఇండ్లలోకి ప్రవేశించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X