పార్టీ పటిష్టత కోసం కలిసి పని చేయాలి
మహబూబాబాద్ సీఎం మీటింగ్ కు పెద్ద ఎత్తున తరలి రావాలి
14వ తేదీన తొర్రూరు లో అయ్యప్ప స్వామి పూజకు భారీగా కదిలి రావాలి
పాలకుర్తి: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పటిష్టత కోసం ప్రజలతో కలిసి నాయకులు అంతా సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మహబూబాబాద్ లో సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీటింగ్ కు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పారు.
అదే విధంగా ఈ నెల 14వ తేదీన తొర్రూరు లో ఘనంగా జరిగే అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమానికి భారీగా రావాలని కోరారు.
పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు 9 లక్షల 18 వేల రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్(CMRF) చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు…
నియోజక వర్గంలో ప్రతి 150 మందికి ముగ్గురు చొప్పున కమిటీ వేయాలని చెప్పాను, కొన్ని చోట్ల పూర్తి అవ్వగా… మరికొన్ని చోట్ల కాలేదు. కానీ చోట వెంటనే వాటిని పూర్తి చేయాలి.
మన ముఖ్యమంత్రి గారిని అడిగితే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. వీటిని కమ్యూనిటీ హాళ్ల కోసం ఖర్చు చేద్దాం.
గతంలో మంజూరు అయిన పనులు తొందరగా పూర్తి చేయాలి.
కుల సంఘాలు కలిసి వస్తే వారి అవసరాల కోసం ఏమి కావాలి అని అడిగితే అది చేద్దాం.
గ్రామాల్లో సీసీ, బిటి రోడ్ల ప్రతిపాదనలు తయారు చేసి పంపండి.
కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుందాం.
సర్పంచులు, మండల నాయకులు సమన్వయంతో పని చేయాలి.
3,4 నెలలలో మరోసారి నిధులు, ఇండ్లు వస్తాయి.
ఇల్లు లేని వారి జాబితా తయారు చేయాలని ఎమ్మార్వో కు చెప్పాను.
గ్రామంలో అర్హులైన ఇండ్లు లేని వారికి ఎవరికి ఇవ్వాలి మీరే నిర్ణయం చేసి చెప్పండి.
పార్టీ పటిష్టత కోసం కలిసి పని చేయాలి.
మహబూబాబాద్ సీఎం మీటింగ్ కి గ్రామాల వారిగా పెద్ద ఎత్తున తరలి రావాలి.
14వ తేదీన తొర్రూరులో అయ్యప్ప స్వామి పూజ ఘనంగా చేస్తున్నాం. ఇక్కడి నుంచి భారీగా అందరూ కదిలి రావాలి.
గ్రామాల్లో సాంకేతిక కారణాల వల్ల కొంతమందికి పెన్షన్లు మిస్ అయ్యాయి. వారందరి దరఖాస్తులు మళ్ళీ తీసుకోండి… వారికి వస్తాయి.