హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 9 మంది కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు నగదు పురస్కారం అందజేశారు సీఎం రేవంత్రెడ్డి. కోటి రూపాయల చెక్కులను అందజేశారు.
తెలంగాణలోని తొమ్మిది మంది కవులు రాష్ట్రానికి అందించిన విశేష సేవలకు గానూ ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదుతో పాటు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, తామ్ర పత్రాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి 2024 డిసెంబర్9న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్బంగా పరేడ్ గ్రౌండ్ లో వారికి చెక్కులు అందజేశారు.
Also Read
తొమ్మిది మంది కవుల్లో అందెశ్రీ,, పాశం యాదగిరి, గద్దర్, గోరేటి వెంకన్న, బండి యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, గూడ అంజయ్య మరియు ఎక్కా యాదగిరి రావు ఉన్నారు. (ఏజెన్సీలు)
