అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి, కాంగ్రేస్ నాయకుల సంతాపం

హైదరాబాద్ : తెలంగాణ తన ఒడిలోంచి ఓ స్వరాన్ని కోల్పోయింది. చేనేత దారంలా మాటలను నేసిన రచయిత అందెశ్రీ ఇకలేరు.. ప్రముఖ రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం (64) కన్నుమూశారు. ఉదయం లాలాపేటలోని ఇంట్లో అందెశ్రీ కుప్పకూలారు. ఆయన్ను గాంధీ ఆస్పత్రికి.. తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్న రేవంత్.. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇది కూడా చదవండి-

అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

కాగా.. అధికార లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎస్‌తో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అందెశ్రీ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని సీఎస్‌కు సూచించారు.
కేసీఆర్ సంతాపం.

Also Read-

అందెశ్రీ మరణం తెలంగాణ కు తీరాని లోటు: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ కవి, ఉద్యమ కారులు, సాహితీవేత్త అందెశ్రీ మరణం తెలంగాణ కు తీరని లోటు.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.. ఆయన ఆకస్మిక మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది.
తెలంగాణ సాహితి దిగ్గజాన్ని కోల్పోయాము.
ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు.
అందెశ్రీ పాట జయ జయహే తెలంగాణ పాట తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసింది.
రాష్ట్ర అవతారంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర‌ దిగ్బ్రాంతి

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. తెలంగాణ ఉద్యమంలో అందే శ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర ఏర్పాటులో సబ్బండ వర్గాలకు ఒక్కతాటి మీదకు తీసుకొచ్చి ప్రజల్లో స్ఫూర్తిని నింపిందని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందే శ్రీ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆయన అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఆయన మృతి పట్ల ప్రగడ సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు మంత్రి సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌.
ప్రజాకవి, రచయిత అందెశ్రీ హఠాన్మరణం బాధాకరం. 2004 సంగారెడ్డి ధూంధాంతో ఆయన పాటతో నాకు పరిచయమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందేశ్రీ పాటలు ప్రజలను చైతన్యపరిచాయి.

తెలంగాణ గడ్డపై ప్రజాకవి అందశ్రీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎవరు మర్చిపోలేం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలది ప్రధాన పాత్ర. ఆయన మరణం తెలంగాణ ప్రజలకి తీరనిలోటు. ఆయన మరణించినా అందెశ్రీ పాట కి మరణం లేదు. తనని పాట ఎప్పటికీ సజీవం గానే ఉంచుతుంది. అందెశ్రీ పాట వింటే పాటలో లోనమయిపోతం. సమాజం గురించి మనిషి గురించి మనుషులు ఎలా వుండాలనే దానిపై అందెశ్రీ పాటలు మనలో చైతన్యం కలిగిస్తాయి.ఆయన ఆత్మకుశాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆయనకు నివాళులు.. అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను

ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి సంతాప

అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు.
ఆయన తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక.
ఆయన ఉద్యమ లక్షణాలు, ఆయన పోరాట పటిమ.. ఆయన రచనలు, ఆయన పాటలు ప్రస్తుత సమాజానికి యువతకు ఎంతో స్ఫూర్తి.
ఆయన తెలంగాణ చరిత్ర, ఉనికి, ఉద్యమ చరిత్రలపై సాహిత్యం పైన రాసిన పాటలు చరిత్రలో నిలిచిపోతాయి.
ఆయన రాసిన జయ జయహే తెలంగాణ పాటను కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రీయ గీతంగా అధికారికంగా ప్రకటించి గౌరవించింది.
ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సంతాపం.. ఆయన కుటుంబానికి నా సానుభూతి. ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న.

జయజయహే తెలంగాణ

ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో జన్మించారు అందెశ్రీ. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతం రచించారు. ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు. గత ఏడాది జూన్‌ 2న నిర్వహించిన తెలంగాణ ఏర్పాటు దినోత్సవంలో ఏమోషన్‌కు లోనయ్యారు అందెశ్రీ. తాను రాసిన పాట అధికారిక కార్యక్రమంలో వినిపిస్తుండగా తాను భావోద్వేగానికి లోనయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X