हैदराबाद: मुख्यमंत्री के चंद्रशेखर राव (KCR) ने तेलंगाना सरकारी उत्सव ‘बतुकम्मा’ (रविवार से शुरु होने वाले) के अवसर पर लोगों को बधाई दी। उन्होंने बधाई संदेश में कहा कि ससुराल से मायके आई बेटियां अनेक प्रकार के फूलों से बतुकम्मा को सजाती है, खेलती और गाती है। इससे ग्रामीण इलाकों की विशेषताएं झलक देखने मिलती है।
मुख्यमंत्री ने कहा कि प्रकृति को पूजते हुए नौ दिनों तक चलने वाले इस उत्सव के दौरान राज्य भर में एक महान सांस्कृतिक का उमंग होता है। तेलंगाना सरकार ने बतुकम्मा उत्सव को राजकीय उत्सव के रूप में मान्यता दी है और इस उत्सव ने तेलंगाना की संस्कृति और महिलाओं के आत्मसम्मान को महत्व दिया है। सीएम ने कहा कि 350 करोड़ रुपये की लागत से सरकार द्वारा विशेष रूप से बनाई गई एक करोड़ बतुकम्मा साड़ियों को महिलाओं को उपहार के रूप में देकर सम्मान कर रहे हैं।
सीएम केसीआर ने कहा कि ‘बतुकम्मा’ उत्सव अब लोगों के जीवन का हिस्सा बन गया है। यह उत्सव महाद्वीपों में भी फैल गया है और तेलंगाना संस्कृति को सार्वभौमिक बन गया है। सीएम ने कहा कि सरकार ने बतुकम्मा उत्सव मनाने के लिए सभी इंतजाम किए हैं। उन्होंने देवी बतुकम्मा से तेलंगाना के लोगों को खुशी और अच्छे स्वास्थ्य का आशीर्वाद प्रदान करने की प्रार्थना की है। इसी क्रम में राज्यपाल तमिलिसाई सौंदरराजन ने भी ‘बतुकम्मा’ की लोगों को बधाई दी है।
బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పండుగ ‘బతుకమ్మ’ ఉత్సవాల ప్రారంభం (ఆదివారం నుంచి) సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు, పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయని అన్నారు.
ప్రకృతిని ఆరాధిస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక సంబురం గొప్పగా వెల్లివిరుస్తుందని సీఎం పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సంస్కృతికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిందన్నారు. దాదాపు రూ.350కోట్ల ఖర్చుతో కోటి మంది ఆడబిడ్డలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన కోటి చీరెలను బతుకమ్మ కానుకగా అందిస్తూ గౌరవించుకుంటున్నామని సీఎం అన్నారు.
ప్రజల జీవనంలో భాగమైపోయిన ‘బతుకమ్మ’ ఖండాంతరాలకు విస్తరించి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాపితం చేసిందన్నారు. బతుకమ్మ పండుగను జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో దీవించాలని ప్రకృతి దేవత బతుకమ్మను సీఎం కేసీఆర్ ప్రార్థించారు. (एजेंसियां)