పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు చేసామని నిండు సభలో అబద్ధాలు చెప్పిన ప్రధాని మోదీ
జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: హిడెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే అదాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థ ల నుండి అప్పులు తీసుకోవడంతో పాటు, ఎల్ ఐసీ అదానీ గ్రూప్ లో రూ. 80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఎస్బీఐ నుండి రూ. 27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుయ రూ. 5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7 వేల కోట్లు, ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయన్నారు. హిడెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51% పడిపోగా, ఎల్ ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చిరుద్యోగులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎల్ ఐసీ షేర్లు కొని, అదానీ సంస్థ కారణంగా తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
అదానీ సంస్థల కారణంగా ఎల్ ఐసీ, ఎస్బీఐ లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు నష్టపోతున్నా ప్రధానమంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బహిష్కరించడం, మోదీ ప్రసంగం సమయంలో వాకౌట్ చేయడంతో పాటు పార్లమెంటులో ప్రతి రోజు నిరసన తెలిపారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని మోదీ, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మోదీకి ప్రజలపై పట్టింపు లేదని, తన మిత్రులైన పారిశ్రామిక వేత్తలపైనే ఎక్కువ పట్టింపు ఉందనే విషయం ఇవ్వాల్టి ప్రధానమంత్రి ప్రసంగంతో తేటతెల్లమైందన్నారు ఎమ్మెల్సీ కవిత.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందని, మొదటి ఏడాది 11 కోటె 84 లక్షల మంది రైతులకు రూ. 6 వేలు ఇచ్చి, రెండో ఏడాది 9 కోట్ల 30 లక్షల రైతులు, ఆ తరువాత ఏడాది 9 కోట్ల రైతులు, ఆ తరువాత ఏడున్నర కోట్ల మంది రైతులు, ఈ ఏడాది 3 కోట్ల 87 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
జగిత్యాల జిల్లా నుండి అకారణంగా 50 వేల మంది రైతులను, నిజామాబాద్ నుంచి 60 వేల రైతులను పీఎం కిసాన్ పథకం నుండి తొలగించారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కానీ ప్రధాని మోదీ ఈరోజు ప్రసంగంలో , ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు చేసామని నిండు సభలో అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
Address Pointers
- PM’s speech in response to President’s address is very disappointing. It was a very rhetorical speech that he has given a 100 times.
- the speech had no mention of Adani, no mention of the money lost of middle class people, common people.
- the speech was repetitive…heckling opposition will not redeem you from your responsibilities.
- the country is watching and your white lies will find a reflection in the next election
- The BJP Govt copies but does not Justice, Rythu Bandhu a a vision and flagship scheme of KCR Govt was adapted by the BJP with a great promise for the farmers that was tactfully year after year reduced. Today when the PM spoke about PM Kisan Yojna, he openly lied about the figures of beneficiaries of the scheme.
- to speak white lies in the parliament is not a great trend in democracy. If you believe you can lie and still come back to power..people will check that arrogance..there’s time PM must try and speak the truth now.
- On the Adani Issue
Mr. Adani becomes 2nd richest person in the world with the support of Govt wherein many significant projects and sectors of national concern are also awarded to Adani.
Adani’s destiny is entwined with various projects of national concern. If he fails, it will be a subject that will affect the country because of the Govt support.
- The BRS Party demands a JPC on this issue- if the PM is clear and not corrupt as he claims, if his biggest plank “ Na khaunga, na khane dunga”, if he’s sticking to it then he must form a JPC or with a sitting Supreme Court judge form a ‘Special Investigative Committee’
- People from diverse backgrounds have invested money in LIC Shares. LIC is India’s company, a company of people – it’s not a private enterprise. If 80,000 crore ₹ were invested by LIC in Adani’s business then it’s our people who will be affected.
- PM Modi it’s okay if you choose not to answer the opposition, but you are accountable with honestly to same 140 crore Indians who you claim today are with you.
- If PM wants to conveniently give ornate speech to hide behind the national flag to protect his friend, Adani then only time will decide the fate of this Govt.
- The BRS Party wants to know
- The status of SBI
- The status of Punjab National Bank, Bank of Baroda, LIC
- Plan of the Government to bail out banks and the people
Or will the PM only bail Adani like his other friends whose massive loans were written off while they escaped from the country.
- Adani or Pradhani it’s all the same now, it’s entwined. Every single person knows that they are two sides of the same coin.
- Prime Minister acts like traffic police who is busy diverting criticism towards the opposition.
- the BRS Party is committed to fight the battle against the Govt to protect every Indian