हैदराबाद: आंध्र प्रदेश के मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी ने एक बार फिर नेकदिली दिखाई है। उन्होंने अपने पास आने वालों को यह कहते हुए मदद करने का आदेश दिया कि वे मुसीबत में हैं। अधिकारी पीड़ितों की मदद के लिए दौड़ पड़े। इससे पीड़ित परिवार खुश हो गये। पीड़ितों का कहना है कि उन्हें उम्मीद नहीं थी कि मुख्यमंत्री इतनी जल्दी उनकी मदद करेंगे।
मुख्यमंत्री जगन के आदेश पर जिलाधीश शिवशंकर और विधायक बोल्ला ब्रह्मनायुडू ने मिलकर मस्तानाम्मा को मकान की जमीन, मकान बनाने के लिए नगद और 50000 रुपये की तत्काल सहायता दी। चिरंजीवी तेजा (thalassemia disease) को तत्काल सहायता के रूप में एक लाख रुपये दिए हैं। कलेक्टर ने आश्वासन दिया है कि उपचार के लिए आवश्यक सहायता भी सीएमआरएफ के माध्यम से प्रदान की जाएगी।
ముఖ్యమంత్రీ హో తో జగన్ జైసా హో, మధ్యాహ్నం హామీ, సాయంత్రానికి సాయం
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్నామని తన దగ్గరకు వచ్చిన వారికి సాయం అందేలా ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు పరుగు పరుగున వెళ్లి బాధితులకు సాయం అందించారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇంత త్వరగా స్పందిస్తారని అనుకోలేదని బాధితులు చెబుతున్నారు.
వినుకొండ పర్యటనలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని పలువురు స్థానికులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. అనారోగ్య బాధితులను జగన్ కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్.
వినుకొండకు చెందిన మస్తానమ్మ ఇల్లు రెండు సంవత్సరాల క్రితం కాలిపోయింది. ఉండటానికి గూడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మస్తానమ్మ. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి చెప్పారు. దీంతో వెంటనే సాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బాధితురాలి ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరఫున సాయం అందించారు.
బాపట్ల జిల్లాకు చెందిన నారాయణస్వామి కుమారుడు చిరంజీవి తేజ రెండో తరగతి చదువుతున్నాడు. కానీ చిరంజీవి తేజ థలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేసిన ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో తన కుమారుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్ధిక స్ధోమత లేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు తేజ తండ్రి నారాయణస్వామి. వెంటనే స్పందించిన జగన్ తక్షణ సహాయం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కలిసి మస్తానమ్మకు ఇంటి స్ధలం, ఇల్లు కట్టుకోవడానికి నగదు, తక్షణ సహాయంగా రూ. 50,000 అందించారు. చిరంజీవి తేజకు తక్షణ సహాయంగా లక్ష రూపాయలు అందించారు, చికిత్సకు అవసరమైన మిగిలిన సాయాన్ని కూడా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. (ఏజెన్సీలు)