CM रेवंत रेड्डी ने दी होली की शुभकामनाएँ, बोले- “सभी परिवारों को सात रंगों की सुंदरता से भर देगा”

हैदराबाद: तेलंगाना के मुख्यमंत्री ए रेवंत रेड्डी ने सभी लोगों को होली की शुभकामनाएं दी है। उन्होंने कहा कि प्रेम, स्नेह, सुख-शांति और भाईचारे का प्रतीक रंगों का त्योहार होली सभी को मनाना चाहिए। उन्होंने कहा कि रंगों के इस त्योहार को प्राकृतिक रंगों और पारंपरिक तरीकों से खुशी-खुशी मनाया जाये।

मुख्यमंत्री ने आगे कहा कि नई सरकार लोक प्रशासन में जो कल्याण और विकास का पालन कर रही है। उसका फल सभी परिवारों को सात रंगों की सुंदरता से भर देगा। उन्होंने कहा कि जाति-धर्म से ऊपर उठकर सभी समुदाय के लोगों की एकता को व्यक्त करने वाला यह त्योहार पूरे देश में एक नये बदलाव की शुरुआत करेगा। उन्होंने उम्मीद जताई कि जल्द ही देश में एक नया लोकतांत्रिक माहौल बनेगा जो लोगों की आशाओं और आकांक्षाओं के अनुरूप सभी वर्गों को न्याय प्रदान करेगा।

అందరికీ హోలీ శుభాకాంక్షలు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు.

కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్త వర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలోనే దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే కొత్త ప్రజాస్వామ్య వాతావరణం వెల్లివిరిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హోలీ శుభాకాంక్షల సందేశం

అందరికీ వసంతోత్సవం (హోలీ) పండగ శుభాకాంక్షలు. మన పండగలు మన సంస్కృతికి ప్రతీకలు. పర్యావరణంతో మనం మమేమకమై జీవించాల్సిన బాధ్యతను గుర్తుచేస్తాయి. ఈ హోలీ పండగ కూడా ఇలాంటిదే. మన జీవితంలోకి నవ వసంతాన్ని ఆహ్వానిస్తూ.. రానున్న కొత్త సంవత్సరం రంగులమయంగా ఉండ కావాల్సిన అవసరాన్ని హోలీ గుర్తుచేస్తుంది.

ఈ సంవత్సరం హోలీ జీవితాల్లో కొత్త వెలుగులు, సరికొత్త రంగులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సహజసిద్ధమైన రంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో పండగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. తెలుగు ప్రజలందరికీ మరోసారి హోలీ పండగ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X