हैदराबाद: विदेश दौरा पूरा करने के बाद तेलंगाना पहुंचे मुख्यमंत्री रेवंत रेड्डी का सांसदों, विधायकों, कांग्रेस कार्यकर्ताओं और प्रशंसकों ने जोरदार भव्य स्वागत किया। सीएम के शमशाबाद पहुंचने पर उनका शॉल, माला और बुके देकर सम्मान किया गया। बाद में रेवंत रेड्डी पर रास्ते में फूलों की बरसात करते हुए जिंदाबाद जैसे नारे लगाए। इसी महीने की 3 तारीख को सीएम रेवंत रेड्डी राज्य में निवेश लाने के लिए अमेरिका और दक्षिण कोरिया के दौरे पर गए थे। इस मौके पर उन्होंने अमेरिका में विश्व प्रसिद्ध कंपनियों के प्रतिनिधियों से मुलाकात की। उन्होंने आश्वासन दिया कि हैदराबाद निवेश के लिए स्वर्ग है और सरकार उद्योग स्थापित करने वालों को हर संभव सहायता प्रदान करेगी।
सीएम वहीं पर तेलंगाना को भावी राज्य घोषित किया। इस दौरे के दौरान सीएम ने अकेले अमेरिका से 31 हजार 532 करोड़ रुपये के निवेश के समझौते पर हस्ताक्षर किये। कॉग्निजेंट, चार्ल्स श्वाब, आर्क्सियम कॉर्निंग, एमजेन, ज़ोइटिस, एचसीए हेल्थकेयर, विविंट फार्मा, थर्मो फिज़र, अरम इक्विटी, ट्रिगिन टेक्नोलॉजीज, मोनार्क ट्रैक्टर जैसी विश्व प्रसिद्ध कंपनियों ने राज्य में विस्तार और नए केंद्र स्थापित करने की इच्छा व्यक्त की है। इनके साथ-साथ, अमेज़ॅन का हैदराबाद में अपने डेटा सेंटर का विस्तार करने का निर्णय इस यात्रा में एक महत्वपूर्ण मील का पत्थर बन गया।
इस दौरे के तहत मुख्यमंत्री की टीम ने एप्पल, गूगल, स्टैनफोर्ड यूनिवर्सिटी और विश्व बैंक के प्रतिनिधियों से चर्चा की है। कौशल विश्वविद्यालय की स्थापना, आर्टिफिशियल इंटेलिजेंस का उपयोग, मुच्चर्ला में चौथे शहर की स्थापना के साथ-साथ प्रौद्योगिकी के विकास के लिए उठाए गए कदमों ने विश्व स्तरीय उद्योगपतियों को आकर्षित किया है। अमेरिका यात्रा के दौरान करीब 19 कंपनियों ने राज्य सरकार के साथ काम करने के लिए एमओयू पर हस्ताक्षर किये। इस प्रकार राज्य में 30 हजार 750 नये रोजगार सृजित होंगे।
यह भी पढ़ें-
इसी क्रम में सीएम ने कोरिया में उद्योगपतियों से भी मुलाकात की। रेवंत ने हुंडई की सहायक कंपनी हुंडई मोटर इंडिया इंजीनियरिंग प्राइवेट लिमिटेड के प्रतिनिधियों से मुलाकात की। उस संगठन के प्रतिनिधियों ने रेवंत रेड्डी की तेलंगाना में निवेश की अपील पर सकारात्मक प्रतिक्रिया दी। उन्होंने कार मेगा परीक्षण केंद्र स्थापित करने की तत्परता व्यक्त की। कोरियाई कंपनियों ने वरंगल में काकतीय मेगा टेक्सटाइल पार्क में निवेश करने में रुचि व्यक्त की है।
कई लोग सीएम के अमेरिका और दक्षिण कोरिया दौरे की तुलना पिछले सीएम केसीआर के चीन दौरे से कर रहे हैं। तत्कालीन सीएम केसीआर 2015 में चीन गए थे और दस दिनों तक वहां के उद्योगपतियों से मुलाकात की थी। सेलकॉन, मकानो, शंघाई इलेक्ट्रिक कॉर्पोरेशन और लियो ग्रुप ने तेलंगाना में निवेश के लिए एक समझौते पर हस्ताक्षर किए हैं। हालाँकि, नौ साल बाद भी सेल कॉन कंपनी को छोड़कर किसी अन्य उद्योग ने तेलंगाना में प्रवेश नहीं किया है। 160 करोड़ रुपये से यूनिट शुरू हुई। इसी संदर्भ में उल्लेखनीय है कि रेवंत रेड्डी के सीएम बनने के आठ महीने के भीतर 81 हजार 564 करोड़ रुपये का निवेश हुआ है। यह मुद्दा इस समय गरमा जा रहा है।
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్ కం, విదేశీ పర్యటన విజయవంతం
హైదరాబాద్: విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు గ్రాండ్ గా స్వాగతం పలికారు. శంషాబాద్ కు చేరుకున్న ఆయనను శాలువలు పూలమాలలు, బొకేలతో సన్మానించారు. అనంతరం దారి పొడువుతాన పూలు చల్లుతూ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడుల స్వర్గధామం హైదరాబాద్ అని, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని అక్కడే ప్రకటించారు. ఈ పర్యటనలో ఒక్క అమెరికా నుంచే సీఎం 31 వేల 532 కోట్ల రూపాయిల పెట్టుబడులకు సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం కార్నింగ్, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వీటితో పాటు హైదరాబాద్‌లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో చెప్పకోదగ్గ మైలు రాయిగా నిలిచింది.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, ముచ్చర్లలో ఫోర్త్ సిటీ ఏర్పాటుతోపాటు టెక్నాలజీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రపంచస్థాయి పారిశ్రామిక వేత్తలను ఆకర్షించాయి. అమెరికా పర్యటన సందర్భంగా దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. తద్వారా రాష్ట్రంంలో కొత్తగా 30వేల 750 ఉద్యోగాలు జనరేట్ అవుతాయి.
అటు కొరియాలోనూ పారిశ్రామిక వేత్తలతో సీఎం భేటీ అయ్యారు. హ్యుందాయ్ అనుబంధ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను సీఎం కలిశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్న రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కారు మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.
సీఎం అమెరికా, దక్షిణ కొరియా టూర్ ను పలువురు గత సీఎం కేసీఆర్ చైనా పర్యటనతో పోల్చి చూస్తున్నారు. 2015లో చైనా వెళ్లిన అప్పటి సీఎం కేసీఆర్ పది రోజులపాటు ఆ దేశంలో పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. సెల్కాన్, మకనో, షాంఘై ఎలక్ట్రిక్ కార్పొరేషన్, లియో గ్రూప్ లతో తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే తొమ్మిదేండ్లు దాటినా సెల్ కాన్ కంపెనీ తప్ప మరో పరిశ్రమ తెలంగాణలోకి ఎంటర్ కాలేదు. రూ. 160 కోట్లతో యూనిట్ ప్రారంభించింది. ఇదే సందర్భంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన ఎనిమిది నెలల వ్యవధిలో రూ.81 వేల 564 కోట్ల పెట్టుబడులు రాబట్టడం విశేషం. ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. (ఏజెన్సీలు)