हैदराबाद: एक नवविवाहित दूल्हा-दुल्हन की शादी के कुछ ही घंटों के भीतर सड़क दुर्घटना में मौत हो गई। यह दुखद घटना छत्तीसगढ़ में घटी है। मिली जानकारी के मुताबिक, रविवार को चांपा जिले के शिवनारायण नगर से एक बारात कार से बलौदा जा रही थी। इसी क्रम में तेज रफ्तार लॉरी ने बारात के साथ जा रही कार को टक्कर मार दी।
इस हादसे में दूल्हा-दुल्हन समेत पांच लोगों की मौत हो गई। सूचना मिलने पर पुलिस मौके पर पहुंची और सहायता कार्य में जुट गई है। मामला दर्ज कर लिया गया है और घटना की जांच की जा रही है। सड़क हादसे से दोनों परिवारों में मातम छा गया है।
వివాహం జరిగిన గంటల్లోనే వరుడు, వధువు మృతి
హైదరాబాద్: వివాహం జరిగిన గంటల్లోనే నూతన వరుడు, వధువు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాద ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఆదివారం చంపా జిల్లాలోని శివనారాయణ్ టౌన్ నుండి కారులో ఓ పెళ్లి బృందం బలోడాకు వెళ్తుంది. ఈ క్రమంలో పెళ్లి బృందం ప్రయాణిస్తోన్న కారును లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సహా ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అప్పటి వరకు పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న ఇరు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. కాళ్ల పారాణి కూడా అరకముందే వధువు, వరుడు మృత్యవాత పడటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. (ఏజెన్సీలు)