ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు, నివాళులర్పించిన…

హైదరాబాద్ : నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక అయిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ వీరనారి చాకలి ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఆనంద్ గౌడ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఎంతో గౌరవకరం. మేము చాకలి ఐలమ్మ గారి సాహసపూర్వక పోరాటాన్ని స్మరించుకుంటున్నాం. వీరనారి చాకలి ఐలమ్మ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిలబడి, ఆ దారుణ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాట ఫలం నేడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చాకలి ఐలమ్మ వారి పోరాటం వల్ల, బడుగు బలహీన వర్గాలు మరియు మహిళలలో ఆత్మవిశ్వాసం పెరిగింది. వారు నిజాం బానిస శృంఖలలను తొలగించేందుకు గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించారు.

విసునూరు రామచంద్ర రెడ్డి వంటి భూస్వాముల బలవంతపు పన్నుల వసూలు వంటి చర్యలను తీవ్రంగా ఎదుర్కొని, చాకలి ఐలమ్మ పోరాటం అమూల్యమైన విజయం సాధించారు. చాకలి ఐలమ్మ గొప్ప పోరాట చరిత్రను గత పాలకులు బాధ్యతలేని విధంగా దాచిపెట్టడానికి ప్రయత్నించారు. వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలబెట్టకపోవడం అనేది అసూయతో, స్వార్థంతో వ్యవహరించే పాలకుల దుశ్చర్య ఇది. పెత్తందారి పెట్టుబడి దారితనం, బూర్జువా మనస్తత్వంతో ఉన్న ప్రభుత్వాలు తరచుగా ఇలాగే చరిత్రను మరచిపోతాయి.

ఇది కూడ చదవండి-

తెలంగాణ రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు, దళితులు తమ హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేసి పోరాటాలు చేశారు.
చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, షోయబుల్లా ఖాన్ మరియు మరెందర ప్రముఖుల త్యాగమే ఈ విజయానికి ప్రధాన కారణం. ఈ త్యాగధనుల ఫలితమే నేటి తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. ఇదే తెలంగాణ సాధన ఫలం. అలాగే, నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ పాలనలో కూడా బడుగు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

కేంద్ర మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించడం, బీసీల హక్కులను పరిరక్షించడానికి జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వడం వంటి అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టారు. మోదీ గారు బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పని చేశారు. విద్యా‑ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కొనసాగించడం ద్వారా బీసీల హక్కులను రక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. మోదీ ప్రభుత్వ పధకాల వల్లే దేశవ్యాప్తంగా బడుగు వర్గాలకు, బీసీలకు విస్తృతంగా అవకాశాలు దొరికాయని అనేక సందర్భాలు నిరూపించాయి.

ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే‑పదే బీసీల పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని నిజమైన స్థిరత్వంతో, చిత్తశుద్ధితో కాకుండా మాటలతో మోసం చేస్తూ వారి హక్కులను కాలరాయడం తగదు. స్థానిక సంస్థల్లో “మేము జీవో తీస్తామంటూ మాటలు మాత్రమే చెలాయించడం తప్పితే.. నిజంగా పారదర్శకంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలనే ఆలోచన లేదు.

రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్గం, విద్యారంగం, ఉద్యోగాల్లో బీసీలకు ఎక్కడ 42% హక్కులు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలి. నామినేట్ పదవులలో బీసీలకు అవకాశాలు కల్పించకపోవడం, కాంట్రాక్ట్ పన్నుల ద్వారా బీసీలు ఎంత పొందుతున్నారో బీసీలు నిరంతరం ప్రశ్నిస్తున్నారు — వాటికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత. నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల సంక్షేమం, మేలు చేసేలా పీఎం విశ్వకర్మ యోజనను ప్రవేశపెట్టి దాదాపు 30 లక్షల కుటుంబాలను ఆదుకున్నారు. మరి వృత్తులపై ఆధారపడి జీవించే వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకుంది..?

కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే… 1955లో బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కాకా కలేల్కర్ కమిషన్ చేసిన సిఫారసులను ఎందుకు అమలు చేయలేదు? బీసీలకు ద్రోహం చేసిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పాలి. 1978లో జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మండల్ కమిషన్‌ను ఇందిరా గాంధీ గారు అడ్డుకున్నారు. 1990లో వీపీ సింగ్ గారు మండల్ కమిషన్ అమలు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టగా, దానిని రాజీవ్ గాంధీ గారు అడ్డుకున్నారు. ఈ నిర్ణయాల వల్లే బీసీల రిజర్వేషన్ల హక్కులు దశాబ్దాల పాటు నిలిచిపోయాయి.

అందువల్ల రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పిదాలకు బీసీలకు సమాజానికి క్షమాపణ చెప్పాలి. బీసీల పేరును కేవలం ఓటు బ్యాంక్ కోసం వాడకుండా, వారి హక్కుల కోసం నిజమైన కృషి చేయాలి. బీహార్‌లోనూ “తెలంగాణ రోల్ మోడల్” అంటూ మోసపూరిత రాజకీయాలు చేయడం మానుకుని, గత చరిత్రను గుర్తుంచుకొని, తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పారదర్శకంగా అమలు చేసి నిజమైన న్యాయం అందించే సమయం ఇది.

1978, 1990లో జరిగిన పోరాటాల్లో కాంగ్రెస్ కుటుంబం చేసిన తప్పుల వల్ల బీసీలు నష్టపోయారు. ముందుగా బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి, బీసీల కోసం నిజంగా ఏ చర్య తీసుకుంటున్నారో స్పష్టంగా ప్రకటించాలి. చాకలి ఐలమ్మను ప్రేరణగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీ గారు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించారు. కాంగ్రెస్ కేవలం బీసీలకు హామీల పేరుతో మాయచేయడం కాదు.. బీసీల హక్కులను కాపాడాలి. అప్పుడే ప్రజలు మిమ్ములను నమ్ముతారు. తెలంగాణలో ఇప్పటికే 22 నెలల కాంగ్రెస్ పాలన గడిచినప్పటికీ.. బీసీలకు న్యాయం చేసేలా, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టబద్ధంగా ముందుకు వెళ్లేలా ఎందుకు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేశారో సమాధానం చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X