हैदराबाद: कालेश्वरम परियोजना का एक महत्वपूर्ण हिस्सा मेडिगड्डा बैराज का पिल् धंस गया हैं। इस संदर्भ में केंद्रीय मंत्री एवं भाजपा प्रदेश अध्यक्ष किशन रेड्डी ने केंद्रीय जल संसाधन मंत्री गजेंद्र शेखावत को पत्र लिखकर बांध की सुरक्षा पर चिंता व्यक्त करते हुए बैराज की सुरक्षा का निरिक्षण करने के लिए केंद्रीय टीम भेजने का आग्रह किया।
इस पर प्रतिक्रिया देते हुए केंद्रीय मंत्री ने केंद्रीय टीम भेजने का फैसला किया। उन्होंने कहा कि केंद्रीय जल संसाधन संघ के सदस्य अनिल जैन की अध्यक्षता में छह सदस्यीय समिति भेजी जाएगी। टीम तेलंगाना सिंचाई विभाग के अधिकारियों से मुलाकात करेगी और कालेश्वरम बांध का दौरा करेगी।
केंद्रीय मंत्री किशन रेड्डी ने पत्र में कहा कि यह दुर्भाग्यपूर्ण है कि मेडीगड्डा पिलर धंस गया हैं। छठे ब्लॉक में गेट नंबर 15 से 20 तक का हिस्सा धंस गया है। उन्होंने कहा कि बैराज के 85 गेट खोलकर पानी नीचे की ओर छोड़ा जा रहा है। उन्होंने कहा कि सिंचाई के लिए संग्रह किया गया सारा पानी बेकार छोड़ा जा रहा है।
इसके निचले इलाके के लोगों ने दहशत में रात गुजारी है। इस संदर्भ में बैराज की सुरक्षा पर उठे सवालों के जवाब में पत्र में अनुरोध किया गया है कि निरीक्षण के लिए एक केंद्रीय टीम भेजी जाये।
కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతను పరిశీలించేందుకు కేంద్ర బృందం
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోకి ముఖ్య భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యారేజీ భద్రతను పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్‌కు లేఖ రాశారు.
దీనికి స్పందించిన కేంద్ర మంత్రి కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని పంపనున్నట్లు చెప్పారు. ఈ బృందం ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై రేపు కాళేశ్వరం డ్యామ్‌ను సందర్శించనుంది.
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 6వ బ్లాక్‌లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయాయన్నారు. దీంతో బ్యారేజ్‌లోని 85 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలేస్తున్నారని చెప్పారు. సాగునీటికోసం జమచేసిన నీళ్లన్నీ వ్యర్థంగా కిందికి వదలాల్సి వచ్చిందన్నారు.
దీని కారణంగా దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు రాత్రంగా భయంభయంగా గడిపారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీ భద్రతపై ఎదరువతున్న ప్రశ్నలకు సమాధానంగా దయచేసి కేంద్రబృందాన్ని పంపించి పరీక్షలు నిర్వహించగాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. (ఏజెన్సీలు)