హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై నోటీసులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పనులకు మళ్లించిన రూ.152 కోట్లను నవంబర్ 30లోగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. లేకుంటే తదుపరి వాయిదాలు సస్పెండ్ చేస్తామని హెచ్చరింది.
గత జూన్‌లో కేంద్ర బృందాలు తెలంగాణలో పర్యటించి ఉపాధి హామీ పథకం నిధులను అనధికార పథకాలకు మళ్లించినట్లు గుర్తించారు. ఉపాధి హామీ పథకం అమలులో పనుల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.