సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష అజమాయిషీ చేయలేడు : జి. కిషన్ రెడ్డి

హైదరాబాద్ : సింగరేణిపై ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష ఆజమాయిషీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా, ఎన్డీయే ప్రభుత్వంలో అయినా, ఎప్పుడూ కేంద్రం జోక్యం లేదు. అయినప్పటికీ సింగరేణి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడారు.

కేంద్రమంత్రి మాడ్లాడుతూ సింగరేణి సుమారు 8 జిల్లాల్లో విస్తరించి ఉండగా, దీనికి 136 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. గతంలో బొగ్గు ఉత్పత్తిలో అనేక రికార్డులు సాధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు వీరోచిత పోరాటం చేశారు. ఆ సమయంలో నేను కూడా తెలంగాణ పోరుయాత్రలో భాగంగా సింగరేణి ప్రాంతాల్లో పర్యటించాను. లాభాల్లో ఉన్న సింగరేణి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా సమస్యల్లో చిక్కుకుంది. ఈ సంస్థలో తెలంగాణ రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ, అనేక సంవత్సరాలుగా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రత్యక్ష జోక్యం లేదా అధికారాలు లేవు.

సింగరేణి బోర్డులో కేంద్రం తరఫున ముగ్గురు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన వర్కింగ్ సిస్టమ్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడుగురు, కేంద్రం నుంచి ఇద్దరు, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ నుంచి ఒకరు కలిపి మొత్తం 10 మంది డైరెక్టర్లతో బోర్డు పనిచేస్తోంది. అన్ని నిర్ణయాలు బోర్డు పరిధిలోనే తీసుకుంటారు. కేంద్ర మంత్రిత్వ శాఖకు కోల్ కంపెనీలకు సంబంధించిన ప్రతి వివరమూ అందదు. రోజూ అనేక టెండర్లు వస్తుంటాయి. టెండర్లలో ఏ నియమాలు పెట్టారన్నది కూడా కేంద్రానికి తెలియజేయరు. ఇవన్నీ పూర్తిగా బోర్డు పరిధిలోనే జరుగుతాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు సింగరేణి నష్టాల బాట పట్టింది. ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కాకుండా, గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా సింగరేణిపై ఆర్థిక విధ్వంసం కొనసాగుతోంది.

నేను కోల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర అవుతోంది. సింగరేణిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఖర్చు తగ్గింపుపై నివేదిక సిద్ధం చేయించాం. ఆ నివేదికపై సింగరేణి అధికారులతో చర్చించాం, సంస్థ ఆర్థిక పరిస్థితిని సమీక్షించాం. ఈ అంశాలన్నింటినీ బోర్డు సమావేశాల్లో డైరెక్టర్లకు వివరించాం. అప్పట్లో నైని కోల్ బ్లాక్ అంశంపై ఎలాంటి చర్చ కూడా జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం పూర్తిగా సింగరేణిపై అజమాయిషీ చేసింది. బోర్డు కేవలం నామమాత్రంగా మారింది. టెండర్ల నుంచి చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబ ఆదేశాలే అమలయ్యాయి. రాజకీయ జోక్యంతో సింగరేణిని సమస్యల్లోకి నెట్టారు. ఇది తెలంగాణ సమాజానికీ, సింగరేణి కార్మికులకూ బాగా తెలుసు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాల్లో సీఎస్ఆర్ నిధులను సోఫాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటికి విచ్చలవిడిగా ఖర్చు చేశారు. వారి నియోజకవర్గాలకే నిధులు మళ్లించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సింగరేణి అప్పులు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.32 వేల కోట్ల బకాయిలు పెట్టింది.

Also Read-

ఇవన్నీ సింగరేణి కార్మికుల సొత్తు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే కార్మికుల రక్తం, చెమటల ఫలితం. అయితే గత 12 సంవత్సరాల్లో సుమారు రూ.47 వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బకాయిగా ఉంచింది. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఉంటుంది. రోడ్లు, వైద్య శిబిరాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ సుమారు రూ.1500 కోట్ల నిధులు ఇప్పటికీ సంబంధిత జిల్లాలకు ఇవ్వలేదు. నిధుల కొరత కారణంగా సింగరేణిలో నూతన సాంకేతికతను ప్రవేశపెట్టలేకపోతున్నారు. పాత యంత్రాలతో పనిచేయడం వల్ల కార్మికులపై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు? ప్రస్తుతం సింగరేణిలో సుమారు 12 ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక ప్రైవేట్ సంస్థలకు పనులు అప్పగించారు. కానీ ఎవరెక్కడ పనిచేస్తున్నారో కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ తెలియజేయలేదు.

బోర్డు సమావేశాల్లో మేము డిస్సెంట్ నోటీసులు ఇచ్చినా, మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో నిర్ణయాలు మాకు తెలియజేయలేదు. సీఎండీ పదవికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ, నాలుగేళ్ల పరిమితి ఉన్నవారిని ఐదేళ్ల వరకు కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్‌చార్జ్ సీఎండీలతోనే కాలం గడుపుతూ, ఫుల్ టైం సీఎండీలను నియమించడం లేదు. నైని కోల్ బ్లాక్ విషయంలో 17 కంపెనీలు సైట్ విజిట్ చేశాయి. జనవరి 29 వరకు టెండర్ ప్రక్రియకు గడువు ఉంది. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా టెండర్లు పిలిచి, ఆఫర్లు వచ్చిన తర్వాత మధ్యలోనే రద్దు చేశారు. 2015లో కేంద్ర ప్రభుత్వం నైని కోల్ బ్లాక్‌ను క్యాప్టివ్ మైన్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించింది. సహజంగా ఆ మైనింగ్ పనులు సింగరేణితోనే చేయించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా “మేము చేయలేము” అని సింగరేణితో లేఖ రాయించి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేసింది.

టెండర్లలో సాధారణంగా ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ సెల్ఫ్ డిక్లరేషన్ రూపంలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. 17 కంపెనీలు విజిట్ చేసినా ఒక్కరికి కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదు. తాడిచెర్ల కోల్ బ్లాక్ విషయంలోనూ ఇదే జరిగింది. ఉమ్మడి ఏపీ కాలంలో సింగరేణికి కేటాయించిన బ్లాక్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య ప్రభుత్వం హయాంలో తాడిచెర్ల కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణితో బలవంతంగా లేఖ రాయించి, ఆ కోల్ బ్లాక్‌ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి సింగరేణిని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురిచేశాయి. దీని ఫలితంగా సింగరేణి సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. కొన్ని సందర్భాల్లో కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.

సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో సుమారు 50 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టీజీ జెన్‌కోకు సరఫరా అవుతోంది.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా బకాయిలు చెల్లించకుండా, సింగరేణిని రోడ్డున పడేసేలా వ్యవహరిస్తోంది. దీంతో 8 జిల్లాల ప్రజల జీవనాధారమైన సింగరేణి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి ఏ కుటుంబానికి చెందిన ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల రక్తం, చెమటతో నిర్మితమైన సంస్థ. సింగరేణిపై పెత్తనం చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడితే చరిత్ర క్షమించదు అని మేము హెచ్చరిస్తున్నాం. గతంలో యూపీఏ హయాంలో పదేళ్ల కాలంలో భారీ బొగ్గు కుంభకోణాలు జరిగాయి. దీంతో సుప్రీంకోర్టు 216 కోల్ బ్లాక్స్‌ను రద్దు చేసింది. కోల్ బ్లాక్స్ జాతీయ ఆస్తి అని, అవి తెల్లకాగితాలపై కాకుండా, వేలం పద్ధతిలోనే కేటాయించాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఆ ఆదేశాల ప్రకారం 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా కోల్ బ్లాక్ ఆక్షన్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఏ ఒక్క కోల్ బ్లాక్‌లో కూడా చిన్న తప్పిదం జరగలేదు. ఈరోజు దేశంలో వందల కోల్ బ్లాక్స్ కేటాయింపుతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. గతంలో 7–8 రోజులకు మాత్రమే సరిపడే బొగ్గు నిల్వలు ఉండేవి. ఈరోజు అవి 25 రోజులకు పెరిగాయి.
నరేంద్ర మోదీ నాయకత్వంలో 2025 నాటికి 1 బిలియన్ టన్నుల రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. దేశంలో బొగ్గు కొరత లేదు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాల వల్ల ఏర్పడిన విద్యుత్ కొరతకు పూర్తి విరుద్ధంగా, ఈరోజు విద్యుత్ కొరత లేని నూతన భారతం ఆవిష్కృతమవుతోంది. దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 74 శాతం బొగ్గు ఆధారంగానే వస్తోంది. అంత పారదర్శకంగా, సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం కోల్ బ్లాక్ వేలం నిర్వహిస్తోంది.

క్యాప్టివ్ మైన్స్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తూ సింగరేణి భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడి సింగరేణిని ఇబ్బందులకు గురిచేశాయి. ఫలితంగా సంస్థ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లి, కొన్ని సందర్భాల్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. సింగరేణి ఉత్పత్తిలో 50 శాతం బొగ్గు టీజీ జెన్‌కోకు సరఫరా అవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోంది. దీంతో 8 జిల్లాల జీవనాడైన సింగరేణి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి ఏ కుటుంబం ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల ఆస్తి. కార్మికుల జీవితాలతో ఆటలాడితే చరిత్ర క్షమించదు.

యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణాల వల్ల 216 కోల్ బ్లాక్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కోల్ బ్లాక్స్ జాతీయ ఆస్తి అని, వేలం విధానంలోనే కేటాయించాలని ఆదేశించింది. 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహిస్తోంది. ఎక్కడా తప్పిదాలు జరగలేదు. నేడు దేశంలో బొగ్గు కొరత లేదు. స్టాక్ 7–8 రోజుల నుంచి 25 రోజులకు పెరిగింది. 2025లో 1 బిలియన్ టన్నుల రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి మోదీ గారి నాయకత్వంలో జరుగుతోంది. దేశంలో 74 శాతం విద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతోంది.

సింగరేణిలో ఖర్చు ఎక్కువగా ఉంది. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో టన్నుకు రూ.1,736 ఖర్చు అయితే, సింగరేణిలో రూ.2,878 ఖర్చవుతోంది. G11 గ్రేడ్ బొగ్గు సింగరేణిలో రూ.4,088కు, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో రూ.2,491కు అమ్ముతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల వివరాలు ఎప్పుడూ వెల్లడించలేదు. తప్పు విధానాలతో టెండర్లలో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధన చేర్చారు. నైని కోల్ బ్లాక్‌లో అక్రమ టెండర్ల విషయంలో కొందరు ఇప్పుడు సీబీఐ దర్యాప్తు చేయాలని అవాకులు పేలుస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తు చేయకూడదని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే.

అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే సీబీఐ తెలంగాణలో అడుగు పెట్టగల పరిస్థితి ఉంది. అలాంటప్పుడు అప్పుడు సీబీఐ ఎందుకు గుర్తుకు రాలేదు? అప్పుడు ఎందుకు “దర్యాప్తు చేయాలి” అని డిమాండ్ చేయలేదు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం 12 ప్రైవేటు కంపెనీలకు టెండర్లు కట్టబెట్టింది. ఆ వివరాలను ఏనాడైనా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారా అంటే – అది కూడా లేదు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. కేంద్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ భవిష్యత్తు కోసం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. సింగరేణిలో ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి, ఎక్స్‌పర్ట్‌లను పంపించి నివేదిక సిద్ధం చేయించాం. “మీ దగ్గర కోల్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అవి తగ్గించుకోవాలి” అని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు వెళ్లింది.

నాగ్‌పూర్‌లోని వెస్ట్రన్ కోల్ ఫీల్డ్, సింగరేణి – రెండింట్లోనూ ఉత్పత్తి స్వభావం దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి రూ.1,736 ఖర్చు అయితే, సింగరేణిలో మాత్రం రూ.2,878 ఖర్చవుతోంది. అంటే 66 శాతం ఎక్కువ ఖర్చు సింగరేణిలోనే జరుగుతోంది. సింగరేణిలో G11 గ్రేడ్ బొగ్గు అమ్మక ధర టన్నుకు రూ.4,088. అదే G11 గ్రేడ్ బొగ్గును వెస్ట్రన్ కోల్ ఫీల్డ్‌లో రూ.2,491కే విక్రయిస్తున్నారు. కోలిండియాలో కూడా ఇదే గ్రేడ్ బొగ్గును తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే సింగరేణిలో అసలు ఖర్చులు ఎంత అవుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ స్పష్టంగా వెల్లడించలేదు.

బొగ్గు వెలికితీత, రవాణాకు సంబంధించిన టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తప్పుడు విధానంతో ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను చేర్చారు. దీంతో పారదర్శకతకు భంగం కలిగింది. సీబీఐ దర్యాప్తు విషయమై మాట్లాడాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రినే అడగాలి. ఎందుకంటే సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేయకూడదని ఉత్తర్వులు తెచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే. అలాంటప్పుడు కేంద్రాన్ని అడగడం ఏమిటి? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కమీషన్లకు అవినీతికి , కరప్షన్‌కు పాల్పడ్డాయి. దాని మూల్యాన్ని సింగరేణి కార్మికులు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోల్ బ్లాక్స్‌కు సంబంధించి వేలం నిర్వహించలేకపోతే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే, కేంద్ర ప్రభుత్వమే పారదర్శకంగా ఆక్షన్ నిర్వహించి సింగరేణికి కేటాయించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X