కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేబినెట్ ఆమోదం, హర్షం వ్యక్తం చేసిన…

హైదరాబాద్ : నేడు భారత రాజకీయ చరిత్రలో మరొక కీలక మైలురాయిగా నిలిచింది. పట్టు వదలని విక్రమార్కుడిగా నిలిచిన ఏఐసిసి నేత రాహుల్ గాంధీ నిరంతర పోరాటం ఫలితంగా, కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం అత్యంత హర్షదాయకమని ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కత్తి వెంటస్వామి, డాక్టర్ కేతూరి వెంకటేష్ అన్నారు.

ఈ సందర్భంగా బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రాహుల్ గాంధీకి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు మరియు ఏఐసిసి కాంగ్రెస్ పెద్దలకు ఏఐసిసి జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Also Read-

ఈ సందర్భంగా ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కత్తి వెంటస్వామి మాట్లాడుతూ “దేశ జనాభాలో 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయం ఇది. కులగణనను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా, బీసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయంగా నిర్వహించాలి. కులగణనను 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే దానికి సుస్థిర ప్రాధాన్యత లభిస్తుంది.”

అలాగే, డాక్టర్ కేతూరి వెంకటేష్ మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం జరపబోయే జాతీయ జనగణనలో కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించాలి. అలాగే భారత రాజ్యాంగం ఆర్టికల్ 15(5) ప్రకారం ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలి.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X