హైదరాబాద్: ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ ఈ సందర్భంగా వారితో కేటీఆర్ మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని, అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు.
ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వం పైన ఒక సానుకూలను స్పందన వస్తున్నదని, మన పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదని, సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది మెసేజ్లు వస్తున్న విషయాన్ని కేటీఆర్ తో పాటు, పార్టీ నాయకులు చర్చించారు. త్వరలోనే పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోదాం అన్నారు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం మరియు ప్రగతి భవన్ కేంద్రంగా విధులు నిర్వహించిన మనమంతా, ఇకపైన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా .
రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన కార్పరేషన్ల చైర్మన్లు
తెలంగాణ పునర్నిర్మాణం లో మాకు అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు
రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీ ఆర్ ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ,బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల కనుగుణంగా పని చేస్తాం
(కార్పొరేషన్ల చైర్మన్లు డా .దూది మెట్ల బాలరాజ్ యాదవ్ రవీందర్ సింగ్ ,డా .వాసుదేవ రెడ్డి , మన్నే క్రిశాంక్ , గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,పల్లె రవికుమార్ గౌడ్ ,పాటి మీద జగన్ మోహన్ రావు ,అనిల్ కూర్మాచలం ,గజ్జెల నగేష్ ,మేడె రాజీవ్ సాగర్ ,డా .ఆంజనేయులు గౌడ్ ,సతీష్ రెడ్డి ,రామచంద్ర నాయక్ ,గూడూరి ప్రవీణ్ ,వాల్యా నాయక్ తదితరులు )
రాజీనామా చేసిన వారు
1. సోమ భరత్ కుమార్చై ర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్
- జూలూరి గౌరీ శంకర్
చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ - పల్లె రవి కుమార్ గౌడ్
చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ - డాక్టర్ ఆంజనేయ గౌడ్
చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ - మేడె రాజీవ్ సాగర్
చైర్మన్, TS Foods Corporation - డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్
చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ - గూడూరు ప్రవీణ్
చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్ - గజ్జెల నగేష్
చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్ - అనిల్ కూర్మాచలం
చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
10.రామచంద్ర నాయక్
చైర్మన్, ట్రైకార్ - వలియా నాయక్
చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ - వై సతీష్ రెడ్డి
చైర్మన్, - డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ - రవీందర్ సింగ్
చైర్మన్, పౌర సరఫరాల సంస్థ - జగన్మోహన్ రావు
చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ రాజీనామా
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియామకం మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా జనవరి 5వ తేదీ2023నాడు బాధ్యతలు చేపట్టిన ఆంజనేయ గౌడ్ 11 నెలలు పదవిలో ఉన్నారు. ఈరోజు ఆయన తన రాజీనామా పత్రాన్ని క్రీడలు యువజన పర్యాటక అభివృద్ధి ముఖ్య కార్యదర్శి కి అందజేశారు.
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ, గౌరవ కేసీఆర్ ఇచ్చిన బాధ్యతలు మేరకు 10 నెలల కాలంలో సీఎం కప్ నిర్వహణతో పాటు తన శక్తి మేరా క్రీడా రంగానికి సేవలు చేశానని ఆయన వివరించారు.
తన పదవీకాలంలో తనకు సహకరించిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులకు ,సిబ్బంది కి అన్ని క్రీడా సంఘాల కార్యవర్గ సభ్యులకు , క్రీడా కారులకు పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఎంతగానో సహకరించిన క్రీడా రంగ జర్నలిస్టులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగ ఉన్నతి కొరకు తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన తెలియజేశారు.